ఆ నిర్ణయాలతోనే ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం పడింది : మంత్రి గొట్టిపాటి

-

మాజీ సీఎం జగన్ దోపిడి కారణంగా గడిచిన ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచినట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. అంతేగాకుండా జగన్ రెడ్డి చేసిన పాపాల కారణంగా ప్రస్తుతం ఏపీ ప్రజల మీద 2023-24 సంవత్సరానికి గాను మరో రూ.11,826.42 కోట్ల భారం పడుతున్నట్లు పేర్కొన్నారు. రెండేళ్ల క్రితమే ఈ మొత్తాన్ని డిస్కంలు ప్రజల నుంచి వసూళ్లు చేస్తామని ఈఆర్సీని కోరినా సంబంధీకులు వాయిదా వేస్తూ వచ్చారని చెప్పారు. చివరగా 2024 మార్చి నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాల్సి వస్తే… ఎన్నికల నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని వాయిదా పర్వం కొనసాగినట్లు స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి గద్దె దిగిపోతూ కూడా తాను చేసిన దోపిడీని ప్రజల నుంచి వసూలు చేయాలని ఈఆర్సీని కోరడం ప్రజలు గమనించాలని కోరారు.

గత ప్రభుత్వంలోనే ప్రజల నుంచి వసూలు చేయాల్సిన మొత్తాన్ని కమిషన్ వాయిదా వేస్తూ అక్టోబర్ లో నిర్ణయం తీసుకుందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఈ కారణంగా జగన్ రెడ్డి చేసిన అక్రమ వసూళ్లు చంద్రబాబు నాయుడు హయాంలో కట్టాల్సి వస్తోందని గుర్తు చేశారు. జగన్ రెడ్డి హయాంలో తీసుకున్న అనాలోచితన నిర్ణయాలతోనే ప్రజలపై విద్యుత్‌ సర్దుబాటు చార్జీల భారం పడిందని స్పష్టం చేశారు మంత్రి రవి కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news