ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఫెగాసెస్ స్పైవేర్ రచ్చ కొనసాగుతుంది. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎమ్మెల్యేల మధ్య ఆరోపణలు తీవ్రం అయ్యాయి. అసెంబ్లీ లో కూడా ఇరు పార్టీల ఎమ్మెల్యేలు ఆరోపణలు చేసుకుంటున్నారు. దీనికి తోడు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఫైబర్ గ్రీడ్ టెండర్ల గురించి కూడా ఇరు పార్టీల ఎమ్మెల్యేలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఫైబర్ గ్రీడ్ టెండర్ల విషయంలో భారీగా అవకతవకాలు అయ్యాయని టీడీపీ పై అధికార పార్టీ ఎమ్మెల్యే లు ఆరోపిస్తున్నారు.
కాగ దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తు.. అసెంబ్లీలోనే ఆందోళన చేశారు. దీంతో స్పీకర్ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. సభకు ఆటంకం కలిగిస్తున్నారని.. ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సస్పెన్షన్ కు గురి అయిన వారిలో బెందాళం అశోక్, రామరాజు, సత్య ప్రసాద్, రామకృష్ణ ఉన్నారు. అలాగే శాసన మండలిలోనూ టీడీపీ సభ్యులు మద్య నిషేధం పై వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిపై మంత్రి బుగ్గన వివరణ ఇచ్చారు. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ ఆందోళన చేసింది. దీంతో మండలిని 10 నిమిషాలు వాయిదా వేశారు.