అమరావతి: జులై 10 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 25 రోజుల పాటు సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జులై 12న బడ్జెట్ ను కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గత ఫిబ్రవరిలో ఎన్నికల దృష్ట్యా గత ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. 25 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది.
కొత్త ప్రభుత్వం.. కొత్తగా ఎన్నికైన వైఎస్సార్సీపీ పార్టీ కావడంతో ఈసారి ఏపీ సీఎం జగన్ దేనికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారు? బడ్జెట్ లో ఏ వరాలు ప్రకటిస్తారోనని ఏపీ ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొత్తగా ఎన్నికైన వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.