లడ్డు వివాదం తర్వాత తొలిసారి ఢిల్లీకి ఏపీ సీఎం.. కీలక అంశాలు చర్చికి వచ్చే అవకాశం..

-

తిరుమల తిరుపతి మహా ప్రసాదంగా భావించే లడ్డు వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీసింది.. సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు ఐదుగురు సభ్యుల కమిటీని నిజ నిర్ధారణ కోసం సిబిఐ ఏర్పాటు చేసింది.. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.. నక్సల్స్ ప్రభావిత సీఎంలతో హోం శాఖ కీలక సమావేశం అనంతరం చంద్రబాబు ప్రధాని మోడీతో భేటీ అవ్వబోతున్నారు..

తిరుమల తిరుపతి దేవస్థానం పై రాజకీయ రంగు పులుముకుంది.. తిరుమల తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వాడారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి.. ఈ క్రమంలో టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు.. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలంటూ ఆయన డిమాండ్ చేసిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు అయిదుగు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి.. దేశ ప్రజల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో నిజ నిజాలు వెలికి తీయాలంటూ ఆదేశించింది.. ఈ నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయి.. సీఎం చంద్రబాబు సైతం నిజాలు బయటికి రావాలంటూ డిమాండ్ చేశారు.. ఈ క్రమంలో ఢిల్లీకి వెళ్ళనున్న చంద్రబాబు ఏపీలో ప్రస్తుత రాజకీయ అంశాలు, లడ్డు వివాదం వంటి కీలక అంశాలపై ప్రధాని మోడీతో చంద్రబాబు చర్చించబోతున్నారనే ప్రచారం పార్టీలో వినిపిస్తోంది..

ప్రముఖంగా లడ్డు వివాదం గురించి కేంద్ర పెద్దలకు చంద్రబాబు వివరించి అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు వైసీపీ చేస్తున్న రాజకీయ పోరాటాల గురించి కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయట. అన్ని వ్యవహారాలు చర్చించిన తరువాత.. ఆయన జాతీయ మీడియాతో ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది.. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి చంద్రబాబు.. అక్కడ మీడియాతో మాట్లాడటం ఆనవాయితీగా వస్తుంది.. అయితే ఈసారి లడ్డు వివాదం తెరమీదకి రావడంతో ఆ విషయంపై ఏం మాట్లాడతారు అనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకి మద్దతుగా ఉంటుందా లేక.. ఏపీలో బలపడేందుకు పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంటుందా అనేది పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది..

Read more RELATED
Recommended to you

Latest news