ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా…?

-

ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయా..? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా షట్ డౌన్ ని ప్రకటించాయి. ప్రభుత్వ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, స్కూల్స్ సెలవులు ప్రకటించాయి. అదే విధంగా ఐటీ కంపెనీలు కూడా వర్క్ ఫ్రం హోం ని ప్రకటించి ఉద్యోగులందరూ తమ విధులను ఇంటి నుంచే నిర్వహించాలని ఆదేశించారు.

ఇక తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. ప్రధానంగా బెంగళూరు సహా రెండు మూడు ప్రాంతాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా విదేశాల నుంచి ఐటీ ఉద్యోగుల ద్వారా ఈ వైరస్ ఉందని గుర్తించిన అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అయితే కర్ణాటకలో ఆనుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.

అక్కడి నుంచి ఎవరైనా వ్యాపారులు ఉద్యోగులు హైదరాబాద్ ,విజయవాడ, వైజాగ్ ప్రాంతాలకు వచ్చారా అనే దాని మీద అధికారులు ఎక్కువగా ఆరాతీస్తున్నారు. ప్రధానంగా బెంగళూరు నుంచి వచ్చిన వాళ్లను గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసే అవకాశం ఉందని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓట్లు వేయడానికి కర్ణాటకలో ఉద్యోగాలు చేసుకునే యువత భారీగా వచ్చే అవకాశం ఉంది. వారి ద్వారా ఈ వైరస్ సోకితే అది మరింత ప్రమాదకరంగా మారుతుందని కాబట్టి రాయలసీమ జిల్లాల్లో వాయిదావేసి సూచనలు ఉన్నాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news