సీనియర్ ఐఏఎస్ అధికారి, మాజీ సియేస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన సెలవు గడువుని పెంచుతూ జగన్ సర్కార్ ఉత్తర్వ్యులు జారి చేసింది. నెల రోజుల పాటు అంటే ఫిబ్రవరి 7 నుంచి మార్చ్ 7 వరకు ఆయన సెలవుని నెల రోజుల పాటు పెంచుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని ఉత్తర్వ్యులు జారి చేసారు.
ఈనెల రోజుల పాటు ఎల్వీ కి సగం జీతం మాత్రమే అందుతుంది. గత ఏడాది ఎన్నికలకు ముందు ఎల్వీ ని సియేస్ గా నియమిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఆయన్ను జగన్ ప్రభుత్వం కొనసాగించింది. అయితే ఏమైందో ఏమో నెలల వ్యవధిలోనే ఆయన్ను బదిలీ చేసి బాపట్లలో హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ బాధ్యతలను అప్పగించారు. ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు బాధ్యతలు స్వీకరించలేదు.
ఆయన తర్వాత నీరాబ్ కుమార్ కి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. వెంటనే రోజుల వ్యవధిలో సీనియర్ మహిళా ఐఏఎస్ ని నియమించారు. డిసెంబర్ ఆరు నుంచి ఆయన సెలవులోనే ఉన్నారు. ఆ తర్వాత సెలవుని వరుసగా పొడిగించుకుంటూ వస్తున్నారు. తాజాగా మరోసారి ఆయన లీవ్ పెట్టుకోగా దానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే కేంద్ర సర్వీసులకు ఆయన వెళ్తారు అనే ప్రచారం జరిగింది.