ఏపీ రెండో దశ పోలింగ్ ఫలితాలు.. గెలుపెవరిదో..!

Join Our Community
follow manalokam on social media

అమరావతి: ఏపీ రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు శనివారం రాత్రి 11.30 గంటలకు విడుదల చేశారు. శనివారం నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. రెండో విడతలో 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు పోలింగ్ నిర్వహించగా.. వీటిలో 539 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. రెండోదశ పోలింగ్ వైఎస్సార్ సీపీ పార్టీ దూసుకెళ్లింది. 2,280 వైసీపీ సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ 420 స్థానాలకు కైవసం చేసుకుంది. బీజేపీ-5, జనసేన-27, ఇతరులు 76 స్థానాలు గెలుపొందారు.

AP-Panchayat-Elections
AP-Panchayat-Elections

రెండోదశ ఫలితాలు వెల్లడించడంతో పార్టీల శ్రేణుల్లో సంబురాలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందు విజయం మాకే సొంతమంటూ అధికార, విపక్ష పార్టీల అభ్యర్థులు సవాల్ విసురుకున్నారు. పల్లెపోరులో తమ జెండా ఎగిరిందని వేడుకలు నిర్వహించుకున్నారు. బాణా సంచాలు కాలస్తూ.. స్వీట్లు పంచుకుంటున్నారు. వైసీపీ, టీడీపీ అభ్యర్థులు పోటాపోటీగా సంబరాల్లో పాల్గొంటూ విజయ కేతనం ఎగురవేస్తున్నారు.

కాగా, తొలి విడతలో 81.41 శాతం ఓటింగ్ పోలైంది. రెండో దశ ఎన్నికల్లో కూడా ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రెండోదశలో 81.61 శాతం ఓటింగ్ నమోదైంది. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీయే అధిక స్థానాలు దక్కించుకుందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రెండోదశ పంచాయతీ స్థానాల్లో 2,280 సీట్లు కైవసం చేసుకున్నామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ తక్కువేం కాదని.. రెండోదశ ఎన్నికల్లో తమ మద్దతుదారులు 40 శాతం మంది గెలిచారని, 600కుపైగా సర్పంచ్ స్థానాలను గెలుచుకుందన్నారు. తుది ఫలితాల వరకు ఆ సంఖ్య పెరుగుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

రెండో విడత ఎన్నికల ఫలితాలు వెలువడిన సమయంలో కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గుంటూరు జిల్లా గొట్టిపాడులో వైసీపీ అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించాడు. దీంతో టీడీపీ మద్దతుదారులు నిరసనకు దిగారు. రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేయడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. రెండోదశ ఎన్నికలు ముగియడంతో సర్కారు మిగిలిన స్థానాలపై దృష్టి సారించింది. గెలుపును అనుకూలంగా మార్చుకుని.. సంక్షేమ పథకాలు, పాలనపై బ్రహ్మరతం పడుతున్నారు. టీడీపీ అభ్యర్థులు కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తూ గెలుపొందాలని ప్రయత్నాలు చేస్తోంది.

TOP STORIES

బిజినెస్ ఐడియా: మహిళలు ఇంట్లోనే ఇలా సంపాదించవచ్చు..!

చాలా మంది మహిళలు నేటి కాలంలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారు. వాళ్ల కోసమే ఈ బిజినెస్ ఐడియాస్. వీటిని అనుసరిస్తే మీరు ప్రతి నెలా మంచి...