ఈ నెల 7న రేవంత్ రెడ్డి కొత్త పీసీసీ గా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఈ నేపథ్యంలో గాంధీ భవన్ లో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే గాంధీ భవన్ లో వస్తూ నిపుణులు, వేద పండితులు పర్యవేక్షించారు. గాంధీ భవన్ లో ఎంట్రీ పాయింట్ ను మార్చుతున్నారు పార్టీ కొత్త కమిటీ నేతలు. ఎంట్రెన్స్ ను గాంధీ భవన్ క్యాంటీన్ నుండి పాత గేట్ నుండి రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు.
గాంధీ భవన్ లో పార్టీ జెండాలు అమ్మే రూమ్ , సెక్యూరిటీ రూంలను తొలగించాలని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. గాంధీ భవన్ తూర్పు ఈశాన్యం వైపు ఎలాంటి బరువు ఉండకుండా ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ నేతలు. అలాగే గాంధీ భవన్ ఆవరణలో ఎలాంటి కట్టడాలు లేకుండా కేవలం గాంధీ విగ్రహం మాత్రమే ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణస్వీకారం నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని కొత్తకమిటీ సభ్యులు చూస్తున్నారు.