తెరపైకి 356: ఎంత ఎక్కువ నిద్రపోతే అంత ఎక్కువ కలలొస్తాయి!!

-

ఆశకి కూడా ఒక హద్దుండాలి.. ఊహకు కూడా ఒక పరిదుండాలి! టైం దొరికింది కదా అని పదేపనిగా పగలూ రాత్రి పడుకుని కలలు కనడం, అనంతరం వాటిని ప్రజలపై రుద్దడం వంటివి చేయడం వల్ల కొత్తగా ఒరిగేదేమీ లేకపోయినా.. ఉన్నది కూడా ఊడే పరిస్థితి రావొచ్చు! ఇంతకూ ఈ ఉపోధ్గాతం అంతా ఎందుకంటే… ఏపీలో రాజ్యాంగంలోని 356 అధీకరణ త్వరలోనే అప్లై అవ్వొచ్చని సూచిస్తోన్న విపక్షాలు, స్వపక్షంలో విపక్షాల పద్దతి గురించి!

అవును.. ఏపీలో వైఎస్ జగన్ సీఎం అయినప్పటినుంచి ఆయనపై పోరాడాలి.. ప్రజల్లో మద్దతు సంపాదించుకోవాలి.. అనే ఆలోచనలు పక్కనపెట్టిన కొందరు రాజకీయ నిరుద్యోగులు, రచ్చబండ రాజకీయాలు చేసే పెద్దలు.. ఏదో ఒక అద్భుతం జరిగి జగన్ ఆ కుర్చీ దిగిపోవాలని కలలు కంటున్నారు! పోనీ దానికోసం ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారా అంటే.. పగటి కలలు కంటున్నారు, ప్రెస్ మీట్ లు పెడుతున్నారు! ఎందుకంటే… వారు ఇప్పటికే ప్రజల తిరస్కారం పరిపూర్ణంగా పొంది ఉన్నారు!

ఈ క్రమంలో ఒకవైపు విపక్ష టీడీపీ నేతలు, మరోవైపు స్వపక్షంలోని విపక్షంగా మారిన ఆర్.ఆర్.ఆర్., ఇంకోపక్క పరిపూర్ణంగా ప్రజల తిరస్కారం పొందిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. వారిలో మచ్చుకు.. తులసీ రెడ్డి వంటి పెద్దలు! వీరందరి కోరికా ఒకటే… ఏపీలో 356 వచ్చేసి, రాష్ట్రపతి పాలన రావాలని!

అవును… నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కారణ తీర్పుపై స్టే ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోవడం హర్షనీయమని మొదలుపెట్టిన ఈ బ్యాచ్ మెంబర్స్… ఏపీలో రాజ్యాంగ సంక్షోభం సృష్టించినప్పుడూ 356 అధికరణ అమల్లోకి వచ్చే అవకాశముందని హెచ్చరించారు. అనంతరం… గవర్నర్ ఆదేశాల మేరకు ఎస్ఈసీగా రమేష్ కుమార్ ను కొనసాగించని పక్షంలో రాజ్యాంగంలోని 356 అధీకరణ క్రింద రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామంటున్నారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఇప్పటికే ఎలా వాడాలో అలా వాడేశారు.. ఆయన జీవితంలో ఊహించని మచ్చలు వేశారు.. ప్రశాంతంగా జరిగిపోయే వ్యవహారంలో వేలుపెట్టి రచ్చ రచ్చ చేశారు.. ఆ మకిలి నిమ్మగడ్డ ప్రశాంత జీవితంపై వేశారు అని పేరు సంపాదించుకున్న కొందరు నేతలు… ఇప్పుడు ఏకంగా ఆ నిమ్మగడ్డ పేరు చెప్పి ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తామనడం కొసమ్మెరుపు!

వీరిలో టీడీపీ నేతల సంగతి కాసేపు పక్కనపెడితే… నిమ్మగడ్డ విషయంలో ఈ రేంజ్ లో స్పందిస్తున్న ఈ రాజకీయ నిరుద్యోగులు… నాడు చంద్రబాబు పాలన సమయంలో జరిగిన దారుణాల విషయంలో స్పందించకుండా ఏ కొలుగులో దాక్కున్నారో అంటూ ఈ సందర్భంగా కామెంట్లు పడుతున్నాయి!!

Read more RELATED
Recommended to you

Latest news