బాలకృష్ణ షాకింగ్ నిర్ణయం.. అది జరిగే పనేనా?

-

బాలయ్య బాబుకు రాయలసీమలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలను చూసి అభిమానించే వాళ్లు కానీ.. సీనియర్ ఎన్టీఆర్ కొడుకు అని గౌరవించేవాళ్లు కానీ.. చాలా మందే ఉన్నారు రాయలసీమలో.

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు బావమరిది, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అవును.. బాలకృష్ణ షాకింగ్ నిర్ణయం ఏం తీసుకున్నారు. కొంపదీసి.. మొన్న టీడీపీ ఓటమిని జీర్ణించుకోలేక రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా? అని మీకు డౌట్ వచ్చిందా? అయ్యో.. కాస్త మేం చెప్పేది వినండి. బాలయ్య బాబు రాజకీయాలకు గుడ్ బై చెప్పడం లేదు. రాజకీయాలకే ఇక నుంచి ఎక్కువ సమయం కేటాయించాలని అనుకుంటున్నారట.

టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని బాలయ్య బాబు అనుకుంటన్నారట. అందుకే.. తనే నడుం బిగించి… కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చి… టీడీపీ నేతల్లో హుషారు నింపాలనుకుంటున్నారట. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు కూడా కొంచెం నైరాశ్యంలో ఉన్నారు. వాళ్లలో ఉన్న నైరాశ్యాన్ని పోగొట్టేందుకే… బాలకృష్ణ ఎక్కువ సమయాన్ని పార్టీ కోసం కేటాయించాలని అనుకుంటున్నారట.

బాలయ్య బాబుకు రాయలసీమలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలను చూసి అభిమానించే వాళ్లు కానీ.. సీనియర్ ఎన్టీఆర్ కొడుకు అని గౌరవించేవాళ్లు కానీ.. చాలా మందే ఉన్నారు రాయలసీమలో. అందుకే.. ఆయనపై ఎంత వ్యతిరేకత వచ్చినా.. టీడీపీని ఏపీ ప్రజలు ఓడించినా… హిందూపురంలో మాత్రం బాలయ్యను గెలిపించుకున్నారు ఆయన అభిమానులు.

తనపై ఇంత అభిమానం పెట్టుకున్న రాయలసీమ వాసుల్లో దైర్యం నింపడం కోసం.. త్వరలో రాయలసీమలో పర్యటించాలని బాలయ్య అనుకుంటున్నారట. పార్టీని పటిష్ట పరిచేందుకు ఇదే సరైన సమయమని… రాయలసీమలో పర్యటించి… ప్రజల్లో, టీడీపీ నాయకుల్లో భరోసా నింపాలని బాలయ్య బాబు ఆలోచిస్తున్నారట.

మరి.. దీనిపై చంద్రబాబు ఏమన్నారో మాత్రం తెలియదు. ఎందుకంటే.. బాలయ్య గురించి అందరికీ తెలిసిందే. ఆయనకు కోపం ఎక్కువ. ఆయన మీద మీద పడ్డట్టుగా ఎవరైనా చేస్తే ఆయనకు కోపం వస్తుంది. ఆయనకు కోపం వస్తే.. కొట్టినా కొడతారు. ఇదివరకు అటువంటి ఘటనలు చాలానే జరిగాయి. బాలయ్య పర్యటన వల్ల టీడీపీకి వచ్చే లాభం అటుంచి… ప్రజలు ఇంకా టీడీపీని చీదరించుకునే పరిస్థితిని అయితే బాలకృష్ణ తీసుకురారు కదా.. అని టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. చూద్దాం… ఏం జరుగుతుందో?

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version