బాలకృష్ణ కి విషయం తెలిసి చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చాడు ?

నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర సంతకం ఫోర్జరీ విషయం ఎప్పుడూ ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తి ఆన్లైన్ బ్యాంకు లావాదేవీల కి సంబంధించిన అప్లికేషన్ కి అప్లై చేయటంతో బ్యాంక్ అధికారులు అప్రమత్తం అవటంతో విషయం మొత్తం బయట పడింది. బ్యాంకులో పనిచేస్తున్న అధికారులు మొత్తం సమగ్రమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సరిగ్గా పాటించడంతో బాలకృష్ణ భార్య అకౌంట్ ఆన్లైన్ మోసం జరగకుండా బయట పడటం జరిగింది. ఈ మొత్తం విషయంలో వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసింది కొత్తగా చేరిన బ్యాంకు ఎకౌంటు ఉద్యోగి అని తేలింది. Image result for balakrishna warning

బంజారాహిల్స్ లోని హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో నందమూరి వసుంధరకు అకౌంట్ ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకుకు సంబంధించిన ఇద్దరు ఉద్యోగులు  బాలకృష్ణ భార్య వసుంధర పర్సనల్ అసిస్టెంట్ సుబ్బారావుకి ఫోన్ చేసి..మేడం మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ కోసం అప్లై చేశారు యాక్టివేట్ చేయాలా అని అడిగారు. దీంతో నందమూరి వసుందర తాను అలాంటివేమీ చేయలేదని పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన బ్యాంక్ ఉద్యోగులు మోసం జరిగినట్లుగా గుర్తించారు.

 

అసలు వసుంధర సంతకం పేరుతో అప్లికేషన్ ఎవరు అప్లై చేశారు అన్న కోణంలో విచారణ జరిపారు. దీంతో బ్యాంకులో ఉద్యోగం పొందిన కొత్త ఉద్యోగి పేరు బయటకు రావడంతో మోసాన్ని గుర్తించారు. వెంటనే బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే ఈ విషయం బాలకృష్ణ దాకా వెళ్లడంతో వెంటనే తన భార్య వసుంధర పర్సనల్ అసిస్టెంట్ దగ్గర ఫోన్ తీసుకుని బ్యాంకు మేనేజర్ కి ఫోన్ చేసి చెడామడా గట్టిగా పెద్ద వార్నింగ్ ఇచ్చాడట. ఇంకోసారి ఇలాంటి తప్పు రిపీట్ అయితే ఊరుకునే ప్రసక్తి లేదని బాలకృష్ణ అన్నాడట.