రైతులను బెదిరించే వారికి ఎమ్మెల్సీ పదవులా..?- బండి సంజయ్

-

వరి ధాన్యం సాగు చేయవద్దు.. వరి ధాన్యాన్ని అమ్మితే షాపులు సీజ్ చేస్తాం అన్నవాళ్లకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తున్నారంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. రైతులు వరిసాగు చేస్తే జైలుకు పంపుతా… రైతులకు విత్తనాలు అమ్మితే జైలుకు పంపుతా అన్న కలెక్టర్ వెంకట్రామి రెడ్డిని ఎమ్మెల్సీ చేయబోతున్నారంటే .. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు.

రైతులను జైల్లో వేయండి… పేదలను వేధించండి.. అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులను ప్రోత్సహిస్తున్నారంటూ విమర్శలు చేశారు. రైతులను వేధిస్తే కలెక్టర్లకు, ఎస్పీలకు అధికారులకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రి పదవులు ఇస్తామని పరోక్షంగా సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. రైతులను ఇబ్బంది పెట్టిన కలెక్టర్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడంటే.. రైతుల పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎటువంటి చిత్తశుద్ధి ఉందో దీని ద్వారా బహిర్గతం అయిందని బండి సంజయ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version