జగన్‌ సర్కార్‌ కు బండ్ల గణేష్‌ కౌంటర్ !

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరో గా వ‌స్తున్న భీమ్లా నాయ‌క్ సినిమా కు ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం షాక్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. భీమ్లా నాయ‌క్ సినిమా కు నైట్ షో లు వేయ‌డానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌లేదు. కేవ‌లం రోజుకు నాలుగు షోలు మాత్ర‌మే వేయాల‌ని ఆదేశించింది. దీని పై జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు తీవ్ర నిరాశ కు గురి అయ్యారు.

అలాగే ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాజా గా నిర్మాత బండ్ల గ‌ణేష్ కూడా జ‌గ‌న్ స‌ర్కార్ కు ట్విట్ట‌ర్ వేదిక గా కౌంట‌ర్ ఇచ్చాడు. ప్ర‌జ‌ల కోసం ప్ర‌గ‌తి కోసం జాతి కోసం రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేయ‌డం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన త‌ప్పా.. అని జ‌గ‌న్ స‌ర్కార్ ను నిర్మాత బండ్ల గ‌ణేష్ ప్ర‌శ్నించాడు. కాగ మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ రిప‌బ్లిక్ సినిమా ఫ్రీ రిలిజ్ ఈవెంట్ లో రాష్ట్ర ప్ర‌భుత్వం పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ మండి ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఈ కార‌ణం తో నే ప‌వ‌న్ క‌ళ్యాణ్ దూకుడు కు రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ళ్లెం వేసిన‌ట్టు ఉంద‌ని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు.