pushpa : ”పుష్ప” ప్రీ-రిలీజ్ ఈవెంట్ ముహుర్తం ఖరారు !

-

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, సెన్సెషనల్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు పార్ట్స్‌ గా రిలీజ్‌ కాబోతోంది. ఇక ఈ పాన్‌ ఇండియా మూవీ లో ఐకాన్‌ స్టార్‌ హీరో బన్నీకి జోడీగా శ్రీ వల్లి పాత్ర లో రష్మిక మందనా నటిస్తోంది. చిత్రంలో ఫహద్ ఫాసిల్​, సునీల్​ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

మ‌రోవైపు యాంకర్ అన‌సూయ కూడా మాస్​ క్యారెక్టర్​లో దర్శనం ఇవ్వనున్నది. ఇప్పటికే ఎన్నో రికార్డుల‌ను తిరగ‌రాసింది ఈ మూవీ. ఈ సినిమా మీద మరింత హైప్స్ క్రియేట్ అయ్యేలా ఐటెం సాంగ్​లో సమంత నటించనుండటం విశేషం. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్ డేట్‌ వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ తేదీని ఖరారు చేసిందట చిత్ర బృందం. డిసెంబర్‌ 12 వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను హైదరాబాద్‌ లో నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తోందట పుష్ప టీం. కాగా.. ఈ సినిమా డిసెంబర్‌ 19 వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news