చంద్రబాబు కి నమస్కారం చేసిన చెవిరెడ్డి.. వీడియో వైరల్

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురస్తున్నాయి. దీంతో ఏపీలో దారుణ పరిస్తితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు… చిత్తూరు జిల్లాలో ఇవాళ పర్యటించారు. రాయల చెరువు కట్టకు పడిన లీకేజీలను వెంటనే పూడ్చి.. స్థానికులలో ఉన్న భయాందోళనలు తొలగించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు.

ఇది ఇలా ఉండగా… చంద్రబాబు పర్యటనలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. రాయల చెరువు వద్ద సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం విప్‌, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి చంద్రబాబు కనిపించగానే.. లేచి నిల్చొని నమస్కారం చేశారు. అయితే.. ఈ సన్నివేశంలో చెవిరెడ్డి నమాస్కారం చేసినట్లు కనిపించినా… చంద్రబాబు చేసాడా ? లేడా ? అనేది క్లారిటీగా కనిపించలేదు. మొత్తానికి ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.