తెలంగాణలో బెంగాల్ ఫార్ములా..అధ్యక్షులని కట్టడి చేస్తారా?

-

ఆ మధ్య పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ అమలు చేసిన వ్యూహాన్ని తెలంగాణలోని రాజకీయ పార్టీలు అమలు చేయాలని చూస్తున్నాయి…ఎన్నికల సమయంలో కీలక నేతలకు చెక్ పెట్టేందుకు బలమైన అభ్యర్ధులని నిలబెట్టి ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. బెంగాల్ ఎన్నికల్లో మమతా ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. బీజేపీని కట్టడి చేయడం కోసం…ఆ పార్టీలోని బలమైన నేతగా సువేందు అధికారిపైనే మమతా పోటీకి దిగారు. ఓడిపోయే ఛాన్స్ ఉందని తెలిసిన కూడా…గెలిచే స్థానాలని వదులుకుని..పని కట్టుకుని సువేందుపై పోటీ చేశారు.

దీని వల్ల సువేందు తన నియోజకవర్గంపైనే ఫోకస్ పెట్టి…రాష్ట్రంపై ఫోకస్ పెట్టలేకపోయారు. అసలు బెంగాల్ లో సువేందుకు చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములని డిసైడ్ చేసే బలం ఉంది. అందుకే సువేందు వేరే స్థానాలపై ఫోకస్ పెట్టకుండా ఉండాలని చెప్పి మమతా డైరక్ట్ సువేందుపై పోటీ చేశారు. చివరికి మమతా ఓడిపోయినా..సరే రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చారు.ఇక ఇదే ఫార్ములాతో తెలంగాణ నేతలు కూడా రాజకీయం మొదలుపెట్టారు. ఇప్పటికే గజ్వేల్ లో పోటీ చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెబుతున్న విషయం తెలిసిందే. కేసీఆర్ ని కట్టడి చేయడానికి బీజేపీ ఈ ప్లాన్ తో ముందుకొస్తుంది. అలాగే హరీష్, కేటీఆర్ లని సైతం కట్టడి చేయడానికి కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ఫార్ములాని టీఆర్ఎస్ సైతం అమలు చేయాలని చూస్తుంది.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ లోని బలమైన నేతలని కట్టడి చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా కాంగ్రెస్ తో పాటు, బీజేపీలోని బడా నేతలకు చెక్ పెట్టాలని ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లని నిలువరించాలని చూస్తున్నారు. వీరిపై బలమైన అభ్యర్ధులని పెట్టి…వీరి ఫోకస్ రాష్ట్రంపై లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ బెంగాల్ ఫార్ములా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version