భూమా అఖిలప్రియకు టిక్కెట్ ఫీవర్..

-

సామాజిక సమీకరణాలు పొలిటికల్ సర్వేలతో టిడిపిలో ఈక్వేషన్స్ మారిపోతున్నాయి.. ఫ్యామిలీలో ఒక్కరికే టికెట్టు అంటూ వినిపిస్తున్న ప్రచారాలతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయట.. ఇంతకీ సీమ టిడిపిలో టిక్కెట్ టెన్షన్ లో ఉన్న ఆ నేత ఎవరో మిరే చూడండి.

దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన భూమా కుటుంబానికి టికెట్ ఫీవర్ పట్టుకుంది.. గతంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ముగ్గురు నేతలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన టిడిపి.. ఇప్పుడు ఆలోచనలో పడింది.. మొహమాటలకు గెలవడం కష్టమని భావించిన అధినేత చంద్రబాబు.. ఇక ఫ్యామిలీ ప్యాకేజీలు కుదరవంటూ కరాకండిగా చెప్పేస్తున్నారట.. దీంతో టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.. వన్ ఫ్యామిలీ – వన్ టికెట్ అంటూ చంద్రబాబు చెబుతుండడంతో.. ఏమి చేయాలో అర్థం కాక ఆశావాహులు తలలు పట్టుకుంటున్నారు.

ఆళ్లగడ్డను అడ్డగా చేసుకుని రాజకీయాలు నడిపిన భూమా కుటుంబానికి ఈ టికెట్ టెన్షన్ పట్టుకుంది.. గత ఎన్నికల్లో ఆళ్లగడ్డ, నంద్యాల నుంచి భూమా కుటుంబికులు ప్రాతినిధ్యం వహించారు.. అయితే ఆళ్లగడ్డలో పోటీ చేసిన అఖిలప్రియ, నంద్యాలలో పోటీ చేసిన బ్రహ్మానంద రెడ్డి ఓటమిపాలయ్యారు.. దీంతో నంద్యాల నుంచి వచ్చే ఎన్నికల్లో ఫరూక్ బరిలో ఉంటారని టిడిపి అధినాయకత్వం లీక్కులు ఇచ్చింది.. టిక్కెట్ కూడా కన్ఫర్మ్ అయిందని ప్రచారం సైతం జరుగుతుంది..

ఈ క్రమంలో అఖిల ప్రియకి టిక్కెట్ ఫీవర్ పట్టుకుంది.. ఆళ్లగడ్డలో తనకైనా టికెట్ ఇస్తారా… లేక పొత్తుల్లో భాగంగా జనసేనకి ఇస్తారా అనే టెన్షన్ లో అఖిలప్రియ ఉందని ఆమె అనుచరులు చెబుతున్నారు.. దశాబ్దాల కాలం సీమలో చక్రం తిప్పిన భూమా కుటుంబానికి వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది.. దీనిపై అఖిలప్రియ ఎక్కడా స్పందించినప్పటికీ.. ఆమెకి కూడా లోలోనా టిక్కెట్ ఫీవర్ పట్టుకుందన్న చర్చ పార్టీలో నడుస్తోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version