బిగ్ బ్రేకింగ్; సెలెక్ట్ కమిటీల ఏర్పాటు

-

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లులులకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేసారు. వికేంద్రీకరణ బిల్లుపై ఒక సెలెక్ట్ కమిటి, సిఆర్దియే రద్దు బిల్లుకి సంబంధించి మరో సెలెక్ట్ కమిటిని ఏర్పాటు చేస్తూ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సభ్యుల పేర్లను ఇవ్వాలని అధికార, విపక్షాలకు చైర్మన్ లేఖలు కూడా రాసారు.

తెలుగుదేశం నుంచి ఐదుగురు, వైసీపీ, బీజేపి, పీడీఎఫ్ నుంచి ఒక్కరు చూపున సెలెక్ట్ కమిటీలో ప్రాతినిధ్యం వహించనున్నారు. సెలెక్ట్ కమిటీలకు చైర్మన్ గా బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రులు ఉన్నారు. ఒక్కో కమిటీలో 9 మందికి చోటు కల్పించనున్నారు. దీనితో సెలెక్ట్ కమిటీలో సభ్యులు ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ముఖ్యంగా విపక్ష పార్టీ నుంచి ఎవరు ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి, మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, బచ్చుల అర్జునుడు, యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్, అశోక్ బాబు తెలుగుదేశం నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో తనకు నమ్మకంగా ఉండే నేతలనే చంద్రబాబు ఉంచే అవకాశం ఉందని అంటున్నారు. ఇక వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఒక మంత్రి ఉండే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news