బీహార్ రాజకీయంలో కీలక పరిణామం…. పార్టీల విలీనంతో 25 ఏళ్ల తరువాత కలిసిన ఇద్దరు మిత్రులు

-

బీహార్ రాజకీయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ లీడర్, మాజీ కేంద్రమంత్రి శరద్ యాదవ్ తన లోక్తాంత్రిక్ జనతా దళ్ (LJD)ని, లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ లోక్ దల్( RLD) పార్టీలో  ఆదివారం విలీనం చేశారు. దాదాపుగా 25 ఏళ్ల తరువాత విడిపోయిన మిత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ లు మళ్లీ కలిశారు. బీహార్ లో బీజేపీ-జేడీయూ ను అడ్డుకోవాలంటే.. బలమైన ప్రతిపక్షం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ విలీనం జరిగిందని తెలుస్తోంది.

‘‘ఆర్జేడీతో మా పార్టీ విలీనం ప్రతిపక్షాల ఐక్యతకు తొలి అడుగు. బీజేపీని ఓడించేందుకు యావత్ విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి, ఏకీకరణే మా ప్రాధాన్యత, ఆ తర్వాతే ఉమ్మడి ప్రతిపక్షానికి ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై ఆలోచిస్తామని’’ శరద్ యాదవ్ అన్నారు. 1997లో లాలూ ప్రసాద్ ఆర్ఎల్డీని స్థాపించినప్పుడు కొన్ని రాజకీయ విభేదాలతో శరద్ యాదవ్ దూరం అయ్యారు. దాదాపుగా 25 ఏళ్ల తరువాత మళ్లీ ఇద్దరు మిత్రులు కలిశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news