కమ్మేస్తున్న కమలం..గేరు మారుస్తున్న కారు!

-

ఊహించని విధంగా కమలం పార్టీ తెలంగాణని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా సరికొత్త ఎత్తులతో రాజకీయం నడుపుతుంది..ఇప్పటివరకు ఒక ఎత్తు…జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత మరొక ఎత్తు అన్నట్లు బీజేపీ తెలంగాణలో రాజకీయం చేయనుంది. ఇంతవరకు రాష్ట్ర స్థాయి నేతలే తెలంగాణపై ఫోకస్ పెట్టి పనిచేశారు…ఇక నుంచి జాతీయ స్థాయి నాయకులు సైతం ఫోకస్ పెట్టనున్నారు…కార్యవర్గ సమావేశాల ద్వారా తెలంగాణలో బీజేపీ బలపడటమే లక్ష్యమని చెప్పనున్నారు.

ఇప్పటికే కార్యవర్గ సమావేశాలకు రెండు రోజులు ముందే బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణలో దిగేశారు…కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం తెలంగాణ పర్యటనకు వచ్చారు. వారంతా 119 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు…119 స్థానాల్లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నేతలు పలు నియోజకవర్గాల్లో పర్యటించి…బూత్ స్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేసుకురావాలనే అంశాలపై స్థానిక నేతలకు దిశా నిర్దేశం చేశారు.

ఇక మరికొంతమంది నేతలు ఇంకా కవర్ అవ్వని నియోజకవర్గాలని కవర్ చేసి…కార్యవర్గ సమావేశాల్లో అధిష్టానానికి తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్తితులని వివరించనున్నారు. ఇలా 119 స్థానాల్లో బీజేపీ నేతలు తిరేగేస్తున్నారు. ఇక మోడీ విజయ్ సంకల్ప్ సభ తర్వాత బీజేపీ నేతలు మరింత దూకుడుగా రాజకీయం చేసి…కేసీఆర్ కు చెక్ పెట్టే దిశగా వెళ్లనున్నారు.

అయితే దూకుడుగా వెళుతున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు అధికార టీఆర్ఎస్ సైతం ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలతో ముందుకొస్తుంది. ఇప్పటికే గ్రేటర్ లో కాషాయ జెండాలు ఎగరకుండా…టీఆర్ఎస్ ఫ్లెక్సిలతో నింపేశారు. అలాగే మోడీ హైదరాబాద్ కు వస్తున్న సమయంలోనే…గ్రేటర్ లో బీజేపీకి షాక్ ఇచ్చారు…బీజేపీకి చెందిన నలుగురు కార్పొరేటర్లని కారుకు ఎక్కించుకున్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్న పలువురు బీజేపీ నేతలని టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా బీజేపీ కూడా వలసలని ప్రోత్సహించనుంది. ఇప్పటికే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. అలాగే మోడీ సభలో పలువురు టీఆర్ఎస్ నేతలని బీజేపీలో చేర్చుకునే కార్యక్రమం చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి బీజేపీ-టీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లు రాజకీయం నడుపుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version