కమలానికి ‘కథానాయకుడు’ ఎక్కడ?

-

తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది..తొలిసారి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని చూస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉండటం..తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ వీక్ అవ్వడం..అటు అధికారంలో ఉన్న కే‌సి‌ఆర్ సైతం బి‌జే‌పినే టార్గెట్ చేయడంతో..తెలంగాణలో బి‌జే‌పి..బి‌ఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ వస్తుంది. జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో సత్తా చాటడం, రెండు ఉపఎన్నికల్లో గెలవడంతో బి‌జే‌పి రేసులోకి వచ్చింది.

ఇక నెక్స్ట్ అధికారమే లక్ష్యంగా బి‌జే‌పి ముందుకెళుతుంది. అయితే అధికారంలోకి రావాలంటే బి‌జే‌పికి బలమైన నాయకులు కావాలి. పార్టీ పరంగా బలంగా ఉన్నా..నాయకత్వ పరంగా కూడా బలంగా ఉండాలి. కానీ ఆ పరిస్తితి బి‌జే‌పికి లేదు. ఇటీవల సర్వేల్లో బి‌జే‌పికి సగానికి సగం నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం లేదని తేలింది. రాష్ట్రంలో 119 స్థానాలు ఉంటే అందులో 45-50 నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీకి గట్టి అభ్యర్థులున్నారని తేలింది. ఇంకో 20 స్థానాల్లో మోస్తరు నాయకులు ఉన్నారట..మిగిలిన స్థానాల్లో అసలు బలమైన నాయకులు లేరని తేలింది. కనీసం బలమైన ద్వితీయ శ్రేణి నాయకులు కూడా లేకపోవడం బి‌జే‌పికి పెద్ద నష్టమని తెలుస్తోంది.

ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, మెదక్ లాంటి జిల్లాల్లో బి‌జే‌పికి బలమైన నాయకులు లేరని తెలిసింది. కాబట్టి ఈ స్థానాల్లో బి‌జే‌పికి బలమైన నాయకులు కావాలి. అయితే ఎన్నికల సమయం దగ్గరపడుతుంది. ఇప్పటికిప్పుడు బలమైన నాయకులని తయారు చేయడం కష్టం..అంటే బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న బలమైన నాయకులని లాక్కుని సీట్లు ఇవ్వాల్సిన పరిస్తితి.

అయినా సరే అన్నీ స్థానాల్లో నాయకులు దొరకడం అంటే చాలా కష్టమైన పని. ఎంతమంది నాయకులనైనా ఇతర పార్టీల్లో నుంచి తీసుకురావడం అనేది కష్టం. ఎన్నికల సమయం ఏమో దగ్గర పడుతుంది. ఇక బి‌జే‌పి గుర్తు మీద ఆధారపడే ముందుకెళ్ళాల్సిన పరిస్తితి. చూడాలి మరి ఎన్నికలనాటికి బి‌జే‌పికి బలమైన నాయకులు దొరుకుతారో లేదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version