తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ కాస్త దూకుడుగా వెళ్తుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ఆ పార్టీ వరుస విజయాలు సాధించడంతో ఇప్పుడు కాస్త దూకుడుగానే తెలంగాణా ప్రభుత్వంపై బిజెపి నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణా సర్కార్ పై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ పాలన తీరు మారకపోతే తెలంగాణలో రాష్ట్రపతి పాలన వస్తోంది అని బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరించారు.
రాజ్యాంగం గురించి నాకంటే కేసీఆర్ కు బాగా తెలుసు అని ఆయన అన్నారు. బెంగాల్ నే కొట్టబోతున్నాం.. తెలంగాణలో కేసీఆర్ మాకు పెద్ద సమస్య కాదు అని ఆయన స్పష్టం చేసారు. కేసీఆర్, కేటీఆర్, ఆర్థికమంత్రి హరీష్ రావు కంటే బురదలో పందులు నయం అని తీవ్ర విమర్శలు చేసారు. కేసీఆర్ ప్రజల్లోకి రావాలని ఆయన డిమాండ్ చేసారు.