కమలంలో పోటీ ఎక్కువే..కానీ పట్టు ఎక్కడ?

-

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్‌తో కాంగ్రెస్, బి‌జే‌పిలు ముందుకెళుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధులని ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీటు దక్కని అసంతృప్తులు భగ్గుమంటున్నారు. ఇలాంటి అసంతృప్తులతో సమస్యలు రాకూడదని కాంగ్రెస్, బి‌జే‌పిలు కొత్త ప్రక్రియ మొదలుపెట్టాయి. మొదట ఎవరెవరు పోటీ చేయాలని అనుకుంటున్నారో వారు దరఖాస్తులు పెట్టుకోవాలని సూచించాయి. అయితే కాంగ్రెస్ ఫీజులు పెట్టింది.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు రూ.25 వేలు, బి‌సి, ఓసీ అభ్యర్ధులకు రూ.50 వేలు పెట్టింది. ఫీజులు ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీకి 119 నియోజకవర్గాలకు 1000 పైనే దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు వీటిల్లో అభ్యర్ధులని ఎంపిక చేసే ప్రక్రియ కాంగ్రెస్ మొదలుపెట్టింది. ఇక ఇదే బాటలో బి‌జే‌పి కూడా వచ్చింది. అభ్యర్ధుల ఎంపికకు దరఖాస్తులు స్వీకరించింది. కానీ ఊహించని విధంగా బి‌జే‌పికి 6,011 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఫీజులు లేకపోవడం వల్లే ఇన్ని దరఖాస్తులు వచ్చాయని చెప్పవచ్చు. ఫీజులు లేకపోతే పరిస్తితి మరొకలా ఉండేది.

సరే ఏదేమైనా భారీగా అప్లికేషన్లు వచ్చాయి. ఇప్పుడు వీటిలో నుంచి అభ్యర్ధులని ఎంపిక చేయాల్సి ఉంది. ఇక ఈ ప్రక్రియ అధిష్టానం చూసుకుంటుంది. అయితే భారీగా దరఖాస్తులు వచ్చాయి. బాగానే ఉంది..కానీ బి‌జే‌పికి అన్నీ స్థానాల్లో బలం ఉందా? అంటే లేదనే విషయం అందరికీ తెలుసు.

ఏదో కొన్ని స్థానాల్లోనే బి‌జే‌పికి బలం ఉంది. అది కూడా బలమైన నాయకులు ఉన్నచోటే పార్టీకి పట్టు ఉంది. దాదాపు బి‌జే‌పికి 30 సీట్ల వరకే పట్టు ఉందనేది తెలుస్తోంది. అలా అని  30 సీట్లలో గెలిచే బలం లేదు. బి‌జే‌పి ఈ సారి ఎన్నికల్లో సింగిల్ డిజిట్ దాటే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 10-20 లోపు సీట్లు గెలుచుకుంటే తెలంగాణ రాజకీయాల్లో సంచలనమే అవుతుంది. చూడాలి మరి బి‌జే‌పి ఎన్ని సీట్లలో సత్తా చాటగలదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version