బ్రేకింగ్; ఎమ్మెల్యేల రాజీనామా ఆమోదించిన స్పీకర్…!

-

మధ్యప్రదేశ్ లో బలపరీక్షకు ముందు స్పీకర్ కీలక పరిణామం చోటు చేసుకుంది. 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ప్రజాపతి ఆమోదించారు. ఈ నెల 10న ఈ-మెయిల్ ద్వారా 16 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుగా రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసారు.

ఈ ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం బెంగళూరులోని ఓ హోటల్‌లో ఉన్నారు. రాజీనామాలను ఆమోదించిన అనంతరం మాట్లాడిన స్పీకర్ .. బెంగళూరులో ఉంటూ వెనక్కి వచ్చేందుకు నిరాకరించిన మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు ఈ నెల 10న సమర్పించిన రాజీనామాలను ఆమోదించడం జరిగిందన్నారు. న్యాయ వ్యవస్థ మార్గదర్శకాలను అసెంబ్లీ పాటిస్తుందని ఆయన ఈ సందర్భంగా స్పష్ట౦ చేసారు.

కమల్‌నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇవాళ సాయంత్రం 5 గంటలకల్లా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలంటూ స్పీకర్ ప్రజాపతికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. 16 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించడంతో అసెంబ్లీలో ఆ పార్టీ బలం ఇప్పుడు 104కు పడిపోయింది. బిజెపికి 107 మంది సభ్యుల బలం ఉండటంతో ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనపడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version