కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుంటున్నారు.. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇప్పుడు కాస్త కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గినా.. బీఆర్ఎస్ ను భూస్తాపితం చెయ్యడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.. ఇంత జరుగుతున్నా.. బీఆర్ఎస్ మాత్రం కొన్ని కీలకమైన విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండటం ఆ పార్టీనేతల్లో చర్చలకు దారి తీస్తోంది..
ఇప్పటి వరకు పది ఎమ్మెల్యేలు పార్టీ మారారు.. మరికొంత మందికూడా గోడ దూకేందుకుసిద్దంగా ఉన్నారు.. అయితే ఎమ్మెల్యేలు జంప్ అయిన చోట ఇన్‌చార్జుల నియామకంపై ఆ పార్టీ ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది.. ఇన్చార్జి పదవులు కావాలని నేతలు కోరుతున్నా.. పార్టీ మాత్రం లైట్ తీసుకుంటోంది.. సమర్దులైన ఇన్చార్జుల కోసం అన్వేషిస్తున్నారా..? లేక మరేదైనా ఆలోచిస్తున్నారా అనేది తెలియక.. క్యాడర్ తలలు పట్టుకుంటోంది..
ఇప్పటి వరకు మొత్తం పది మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరితే.. ఒక్కచోట మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జిని నియమించింది.. మిగిలిన తొమ్మిది చోట్ల ఎవరికి బాధ్యతలు అప్పగించలేదు.. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కూడా బలహీనపడుతోందన్న టాక్ క్యాడర్లో వినిపిస్తోంది.. తమను నడిపించే నాయకుడే లేరని.. ఇక పార్టీ ఎలా బలోపతం అవుతుందని కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు..
ఖైరతాబాద్ లాంటి నియోజకవర్గంలో ఇన్చార్జి పోస్ట్ కోసం పోటీ ఉంది.. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ దాని జోలికి కూడా పోలేదు.. మిగిలిన తొమ్మిది చోట్లా ఇన్చార్జులను వెంటనే నియమిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ ను సమాయత్తం చేయ్యొచ్చని ఇన్చార్జి పదవులు ఆశిస్తున్న నేతలు పార్టీ నాయకత్వానికి సూచించారట.. అయితే అధినేత కేసీఆర్.. ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకపోవడం.. కేటీఆర్, హరీష్ రావులకు కాంగ్రెస్ మీద విమర్శలు చెయ్యడానికి టైమ్ సరిపోకపోవడంతో.. ఇన్చార్జుల నియామకం ఇంకా లేట్అయ్యే ఛాన్స్ ఉందని పార్టీలో చర్చనడుస్తోంది..