ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన వివాదంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటనపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిన వారికి మళ్లీ అక్కడికి వెళ్లే అర్హత లేదని మండిపడ్డారు. చెప్పినా వినకుండా వెళ్తే హిందువులు ఏకమై వారిని చంపేస్తారని హెచ్చరించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు గౌరవించాలని రాజాసింగ్ సూచించారు. తిరుపతి, శ్రీశైలంలో మత మార్పిడి చర్యలకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కాగా ఈ నెల 28వ తేదీన తిరుమల పర్యటనకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. అదికూడా కాలినడకన వెళతారు జగన్.