టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ఆ తర్వాత పలు క్లాసికల్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. మరొకవైపు గబ్బర్ సింగ్ లాంటి మాస్, యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన పవన్ కళ్యాణ్ మేనియా విపరీతంగా పాకిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు నార్త్ లో కూడా ఈయనకు ఎక్కువగా అభిమానులు ఉన్నారు.
ప్రస్తుతం వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పదవే లక్ష్యంగా పోటీపడుతున్న పవన్ కళ్యాణ్ మరొకవైపు ప్రేక్షకులను అలరించడానికి పలు సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి మొదటిసారి చేసిన సినిమా బ్రో. తమిళంలో భారీ విజయం సాధించిన వినోదయ సీతం సినిమాను రీమేక్ చేసి తెలుగులో బ్రో విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమాకి కూడా తెలుగులో సముద్రఖని దర్శకత్వం వహించారు. ఇకపోతే ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అన్నీ కూడా గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించడం జరిగింది.
నిన్న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. వర్షాలు వస్తున్నప్పటికీ లెక్కచేయకుండా అభిమానులు పవన్ కళ్యాణ్ సినిమాను థియేటర్లలో చూడడానికి బారులు తీరుతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఎంత పారితోషకం తీసుకున్నారో అనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. మొన్నటి వరకు రూ .30 కోట్ల వరకు పారితోషకం అందుకున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఏకంగా రూ.50 కోట్ల పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ రేంజ్ పెరిగిపోయిందని చెప్పాలి.