అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు.. కేంద్రం నుంచి భరోసా..

-

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి నిర్మాణంలో వేగం పుంజుకుంటుందని అందరూ భావించారు.. నిర్మాణానికి అవసరమైన నిధులు లేకపోవడంతో.. సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వ సాయం అడిగారు.. కేంద్రంలో టీడీపీ భాగస్వామిగా ఉండటంతో.. కేంద్రం కూడా నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇచ్చింది.. ఇందులో భాగంగా.. 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సంసిద్దత వ్యక్తం చేసాయి.

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబునాయుడు.. అమరావతి నిర్మాణానికి అవసరమైన వాటిపై దృష్టి పెట్టారు.. అమరావతికి రోడ్డు, రైలు కనెక్టివిటీ పైన కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు..ఇదే విషయంపై మంత్రి గడ్కరీతో సమావేశమై.. ఆయన వద్ద నుంచి కీలక హామీ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కనెక్టివిటీ, అమరావతి – హైదరాబాద్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్ప్రెస్‌ వే, అమరావతి-రాయలసీమ జిల్లాల కనెక్టివిటీ సహా రాష్ట్రంలోని పలు ఇతర జాతీయ రహదారుల గురించి చర్చించినట్లు.. అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి..

వైసీపీ హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి నిర్మాణం జాప్యం జరిగింది.. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని అన్ని విధాల అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకున్నారు.. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఏపీ రాజధాని అమరావతేనని ప్రకటించి.. దాని నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తోంది.. విశాఖస్టీల్ ప్లాంట్ మీద కూడా సీఎం చంద్రబాబునాయుడు డిల్లీలో కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిశారు.. సెయిల్ లో స్టీల్ ఫ్యాక్టరీ విలీన ప్రతిపాదనలపై ఆయనతో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది.. చివరగా ప్రధానితో స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై చంద్రబాబు మాట్లాడనున్నారు.. కార్మికుల త్యాగాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేస్తే.. ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశముందని ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్తున్నారు.. మొత్తంగా చంద్రబాబు డిల్లీ పర్యటనలో అమరావతి నిర్మాణంతో పాటు.. స్టీల్ ప్లాంట్ అంశం గురించి చర్చించినట్లు డిల్లీ వర్గాలు చర్చించుకుంటున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version