లాక్‌డౌన్‌పై కేంద్రం ఫార్ములా.. జోన్ల వారిగా ఆంక్ష‌లు..!!

-

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఆగ్ర‌రాజ్యంగా చెప్పుకునే అమెరికా క‌రోనా దెబ్బ‌కు చిగురుటాకులా వణికిపోతోంది. ఇక భార‌త్ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. భార‌త్‌లో క‌రోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే భారత్‌లో కరోనావైరస్ సోకిన వారి సంఖ్య ఎనిమిది వేల‌కుపైగా చేరుకోగా.. మ‌ర‌ణాల సంఖ్య 239కి చేరుకుంది. ప్ర‌స్తుతం క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. అయితే ఈ లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుంది.

PM urges citizens to follow 'Janta curfew' on March 22 - INDIA ...

కానీ, కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు కనుక లాక్ డౌన్ ఎత్తివేస్తే ఇప్పటివరకు చేసినదంతా వేస్ట్ అవ్వ‌డ‌మే కాకుండా మ‌రిన్ని విప‌త్క‌ర ప‌ర‌స్థితులు ఎదుర్కోవాల‌ని శనివారం ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోడీకి తెలియజేశారు. ప్రధాని కూడా లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపారు. ఇక ప్రధానితో వీడియో సమావేశం అనంతరం మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు ఏప్రిల్ 30 వరకు తమ రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి.

దీంతో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తార‌ని స్ప‌ష్టంగా అర్థం అయిపోయింది. ఇక‌ చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపడంతో కేంద్రం ఆదివారం(నేడు) ప్రకటన చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు కేంద్రం విడుదల చేయనున్న‌ట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా ఆయా ప్రాంతాలను విభజించ‌నున్నారు. రెడ్ జోన్‌పై పూర్తిస్థాయి ఆంక్షలు ఉంటాయి. ఆరెంజ్ జోన్‌లో పరిమితమైన ఆంక్షలు ఉంటాయి. గ్రీన్ జోన్‌లో ఆంక్షలపై సడలింపు ఉంటాయ‌ని తెలుస్తోంది. ఏదేమైనా లాక్‌డౌన్‌పై కేంద్రం ప‌క్కా ఫార్ములాతో ముందుకు వెళ్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news