బాబుకి ధైర్యం వచ్చేసింది… లేఖ రాశారు… తమ్ముళ్లు హ్యాపీ!

ఏమాటకామాట మాట్లాడుకోవాలంటే… కరోనా విషయంలో చంద్రబాబుకి మాములు భయం పట్టలేదు! అది భయం అనుకోండి, అతి జాగ్రత్త అనుకోండి.. 60ఏళ్లు దాటినవారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటాది అని చెబుతున్న సమయంలో.. తన ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువకాదు అని అనుకున్నారో ఏమో కానీ.. ఇళ్లు వదిలి బయటకు రాలేదు బాబు! కరోనాతో రాష్ట్రం ఏమైపోతున్నా.. విశాఖలో 12 మంది మరణించినా కూడా ఇంటినుంచి కాలు కదపలేదు బాబు! అయితే… ఇప్పుడు కాస్త కరోనా ప్రభావం తగ్గింది.. జనాలు కూడా పార్టీని, తనను మారిచిపోయి.. లోకేష్ ను తనను ఒకే ఘాటిన కట్టే పరిస్థితి వస్తుందని భావించారో ఏమో కానీ… “విశాఖ వెళ్తాను అనుమతి ఇవ్వండని” ఏపీ డీజీపీకి లేఖ రాశారు చంద్రబాబు!

అసలు సిసలు సమయంలో కరోనా కు భయపడి ఏపీకి వెళ్లకుండా.. కేంద్రం అనుమతి ఇవ్వలేదని తనదైన వాదనలు చేసిన చంద్రబాబుకు… నాడు వచ్చిన అభిజాత్యం ఇప్పుడు లేదో ఏమో కానీ… నాడు కేంద్రానికి లేఖ రాసిన అభాసుపాలయిన ఆయన… ఇప్పుడు మాత్రం ఏపీ డీజీపీ దగ్గరకే వెళ్లారు!! అవును… హైదరాబాద్‌ లో ఉన్న తాను రాష్ట్రానికి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు డీజీపీ గౌతం సవాంగ్‌ ను కోరారు. ఈ మేరకు డీజీపీకి లేఖ రాసిన ఆయన… హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే విమానంలో సోమవారం ఉదయం 10.35 గంటలకు ప్రయాణించాలనుకుంటున్నానని.. విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ బాధిత కుటుంబాలను కలిసిన అనంతరం అదేరోజు అక్కడినుంచి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసానికి రోడ్డు మార్గంలో ప్రయాణించాలనుకుంటున్నట్టు వివరించారు.

ఈ విషయంపై ఏపీ సర్కార్, డీజీపీ ఎలా స్పందిస్తారు అనే విషయం కాసేపు పక్కనపెడితే… ఈపని బాబు ఎప్పుడో చేసి ఉంటే బాగుండేదని తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారట! ఇటు అధికారపక్షం విమర్శించడానికి కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చి.. ప్రజలకు కూడా దూరం అయ్యి.. తన స్వార్థం ముందు ప్రజల ప్రాణాలు సైతం పెద్ద పట్టింపు కాదు అనే సంకేతాలు జనాల్లోకి పంపి.. ఇప్పుడు మళ్లీ ఏపీ డీజీపీ కే లేఖ రాయడంతో… అన్ని రకాలుగా దెబ్బలు తగిలించేసుకున్నట్లయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు!!

ఏది ఏమైనా… ఇప్పటికైనా ధైర్యం చేసి ఏపీకి వస్తోన్న చంద్రబాబు నిర్ణయానికి పలువురు తమ్ముళ్లు లోలోపల థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. ఒకపక్క అధికారపక్షం ప్రజల్లో దూసుకుపోతూ ఉంటే… మనం మాత్రం ఆన్ లైన్ రాజకీయాలకే పరిమితం అయిపోయామని… పోనీలే ఇప్పటికైనా పార్టీలో మళ్లీ కదలికలు స్టార్ట్ అవుతాయని అంటున్నారట!!