టీడీపీలో ఈ విషయంలో మార్పు రాదా…?

Join Our Community
follow manalokam on social media

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో కొన్ని కొన్ని కీలక మార్పులు దిశగా చంద్రబాబునాయుడు అడుగులు వేస్తున్నారని ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చెబుతుంది. అయితే చంద్రబాబునాయుడు కొన్ని కొన్ని విషయాల్లో ఘోరంగా వెనకబడి ఉన్నారు. సోషల్ మీడియా విషయంలో చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టకపోవడంతో కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతున్నారు.

చాలామంది నాయకులు సోషల్ మీడియాలో దూకుడుగా వెళ్లలేకపోతున్నారు. ఒకపక్కన అధికార వైసీపీ నేతలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారాలను కూడా ప్రజలకు అందించే కార్యక్రమాలు చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఉదయాన్నే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసే పరిస్థితి ఉంది. కానీ ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఘోరంగా విఫలమవుతున్నారు.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లి సమస్యలు కూడా తెలుసుకోవడం లేదు. సంక్షేమ కార్యక్రమాల గురించి సోషల్ మీడియాలో కనీసం పోస్ట్ కూడా పెట్టే ప్రయత్నం చేయటం లేదు. దీని వలన పార్టీలో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను చంద్రబాబునాయుడు పరిష్కరించకపోతే పార్టీ రోజు రోజుకి కూడా వెనకబడి పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే కొంత మంది కార్యకర్తలు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అనేక రకాలుగా విజ్ఞప్తిని కూడా పంపిస్తున్నారు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...