బ్రహ్మణి – లోకేశ్ తీసుకున్న నిర్ణయం చంద్రబాబు కి అస్సలు నచ్చలేదు ?

-

చంద్రబాబు తనయుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నారా లోకేష్ మొట్టమొదటిసారి 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. అంతకు ముందు పార్టీ ఎమ్మెల్సీ రూపంలో మంత్రిగా చంద్రబాబు హయాంలో పని చేసిన నారా లోకేష్ ఆయన వ్యవహరించిన తీరు, మాట్లాడే తీరు వల్ల ఆయన రాజకీయాలకు పనికిరాడు అని చాలా మంది టీడీపీ వాళ్లు కామెంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న టిడిపి అధికార పార్టీ పై పోరాటం చేయాల్సిన సందర్భంలో నారా లోకేష్ ఎక్కువగా ట్విట్టర్ లోనే ఉండటంతో  ట్విట్టర్ పిట్ట అంటూ రాజకీయ ప్రత్యర్థులు ఆయనపై విమర్శలు చేస్తూ ఆటపట్టిస్తున్నారు. TDP Below Cader Leaders Angry On Nara Lokesh About His Conduct The Dinner-Chandrababu Praja Chaitanya Yatra Lokesh Tdpఇదే తరుణంలో టిడిపి పార్టీలో కీలక నాయకుల వారసులతో నారా లోకేష్ ఇటీవల పార్టీ చేసుకోవటంతో తెలుగుదేశం పార్టీలో తీవ్ర విమర్శలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో టిడిపి పార్టీ పరిస్థితి చాలా దారుణంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో ఈ విధంగా బ్రాహ్మణి మరియు నారా లోకేష్ పార్టీ అరేంజ్ చేయడం పట్ల సొంత పార్టీలో నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తండ్రి చంద్రబాబు నాయుడు పార్టీ కోసం కష్టపడుతుంటే కొడుకు మరియు కోడలు ఈ విధంగా వ్యవహరించడం ఏంటి అంటూ మండిపడుతున్నారు.

 

ఇదే తరుణంలో టిడిపి అధినేత చంద్రబాబు కూడా ఈ నిర్ణయం తీసుకున్నా బ్రాహ్మణి మరియు నారా లోకేష్ ఇద్దరినీ తన దగ్గరకు పిలిపించుకుని ఇలాంటివి ఎవరు చేయమన్నారు మిమ్మల్ని,.. అసలే పార్టీ పరిస్థితి బాలేదు మీరు తీసుకున్న నిర్ణయం కూడా అస్సలు నచ్చలేదు ఇంకెప్పుడు ఇలాంటివి చెయ్యొద్దు అని వార్నింగ్ ఇచ్చారట. ఒకపక్క నన్ను విశాఖపట్టణం బయట విమానాశ్రయం దగ్గర అరెస్టు చేసి క్యాడర్ బాధపడుతుంటే…మీరు ఇటువంటి సమయంలో పార్టీ చేయడం చాలా పెద్ద తప్పు అని చంద్రబాబు ఇద్దరికీ తెలియజేశారట. దీంతో ఈ వార్త టిడిపిలో వైరల్ న్యూస్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news