చెప్పేదొకటి.. చేసేదొకటి… ఇది చంద్రబాబు అసలు నైజo. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చేసేవన్నీ చిల్లర పనులే.తనకు, తన పార్టీకి లబ్ది చేకూరేలా మాత్రమే ఆయన వ్యవహారం ఉంటుంది. ఇదే విధంగా పొత్తులు ఉండాలన్నదే అతని ఉద్దేశ్యం.ఇన్నాళ్లుగా జనసేనతో పొత్తు అంటూ పవన్, కాపుల బలాన్ని వాడుకునేందుకు ప్లాన్ వేసిన చంద్రబాబు జాబితా ప్రకటన సమయంలో అసలు రూపాన్ని,రంగును బయటపెట్టారు.ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.తొలివిడతలో మొత్తం 118 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు తెలుగుదేశానికి 94 … సీట్లు జనసేనకు 24 సీట్లు కేటాయించి తన నైజం ఇదేనని పరోక్షంగా చెప్పుకున్నారు.
94 స్థానాలకు టీడీపీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన చంద్రబాబు జనసేన విషయంలో 24కి గాను కేవలం 5 మంది పేర్లను మాత్రమే బహిర్గతం చేశారు.మరో 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. అంటే జనసేన అధినేత పవన్ కూడా తాను చెప్పినట్లే వినాలి అనేలా వ్యవహరిస్తున్నారు ఈ మాజీ సీఎం.చివరికి అక్కడ కూడా టీడీపీ అభ్యర్థులనే నిలబెడతారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ కూటమి ఇంకా 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జనసేనకు కాపులను దూరం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.అటు కేడర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
టీడీపీ తరపున ప్రకటించిన సీట్లలో చంద్రబాబు, లోకేష్ , అచ్చెన్నాయుడు,బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. కానీ జనసేన తరఫున వెల్లడించిన ఐదుగురిలో పవన్ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కనీసం పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా అసలు ప్రస్తావన లేదు.
తన సీటును తాను ప్రకటించుకోలేని దీనస్థితిలో పవన్ టీడీపీతో పొత్తుకు సిద్ధమయ్యారా అని జనసేన సైనికులు ఆవేదన చెందుతున్నారు.
బీజేపీతో పొత్తు కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న చంద్రబాబు…. అక్కడి నుంచి సిగ్నల్ రాగానే జనసేన సీట్లలో బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు చంద్రబాబు వెంపర్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.జనసేనకు ఎన్నో కొన్ని సీట్లు ముష్టి వేసి మిగతావి బీజేపీకి రిజర్వ్ చేసారని అంటున్నారు.మొత్తానికి ఛీ చ్చీ అంటున్నా బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు ఆశగా చూస్తున్నారని,ఇందుకోసం పవన్ ని బలిచేయడానికి సిద్ధమయ్యాడని జనసైనికులు ఆగ్రహం చెందుతున్నారు. చివరికి చంద్రబాబు ఎత్తులో పవన్ చిత్తు కావడం ఖాయమని అంటున్నారు.