చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అడ్వకేట్ అరెస్ట్.. 10 లక్షలు సీజ్

-

సందీప్ రెడ్డి… కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమీప బంధువు. 2008 నుంచి విశ్వేశ్వర్ రెడ్డికి సందీప్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా, లాయర్ గా ఉన్నాడు.

తెలంగాణలో ఒక రోజులో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయనగా… పోలీసులకు భారీగా నగదు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు లభించాయి. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓటర్లకు భారీగా డబ్బులు పంచాడని తేలింది. ఆయన వ్యక్తిగత కార్యదర్శి, అడ్వకేట్ కొండా సందీప్ రెడ్డి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. గచ్చిబౌలిలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు సందీప్ రెడ్డి కారును కూడా ఆపారు. ఆయన కారును తనిఖీ చేయగా.. 10 లక్షల రూపాయల నగదు, కొన్ని కీలక డాక్యుమెంట్లు, మూడు ల్యాప్ టాప్ లను పోలీసులు ఆయన కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సందీప్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

కీలక డాక్యుమెంట్లలో ఎవరెవరికి ఎన్ని డబ్బులు ఇచ్చారు. ఎంత పంచారు అనే వివరాలు ఉన్నట్టు.. అవన్నీ కోడ్ భాషలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వాటిని డీకోడ్ చేయగా… సందీప్ రెడ్డి… విశ్వేశ్వర్ రెడ్డి తరుపున చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో డబ్బులు పంచినట్టు తెలుస్తోంది. ఆ డాక్యుమెంట్ల ప్రకారం.. సుమారు 15 కోట్లను ఎన్నికల్లో పంచినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. వెంటనే పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం అందించారు.

సందీప్ రెడ్డి… కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమీప బంధువు. 2008 నుంచి విశ్వేశ్వర్ రెడ్డికి సందీప్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా, లాయర్ గా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version