ఏపీ కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకంకు ఏపీ కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సిఎం జగన్ ఈ పథకంపై క్లారిటీ ఇచ్చారు. 30, 35 ఏళ్ళ పాటు రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో ఏ ఇబ్బంది లేదని ఆయన అన్నారు. రైతులకు ఇచ్చే విద్యుత్ ఎప్పటికి ఉచితమే అని ఆయన స్పష్టం చేసారు. ఒక్క కనెక్షన్ కూడా తొలగించేది లేదని అన్నారు.
ఒక్క పైసా కూడా రైతుపై భారం వేసేది లేదని ఆయన అన్నారు. రైతులు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని జగన్ హామీ ఇచ్చారు. కాగా ఏపీలో ఉచిత విద్యుత్, నగదు బదిలీ కార్యక్రమంపై విపక్షాలు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులపై భారం వేయడానికే ఈ కార్యక్రమం జరుగుతుందని విపక్షాలు ఆరోపించాయి.