పెన్షన్ వ్యూహంతో జగన్ మంచి మార్కులు కొట్టేసారా…?

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ విషయంలో అనుసరించిన విధానం అందరిని ఆకట్టుకుంటుంది. గతంలో పెన్షన్ రావాలి అంటే బ్యాంకు లు పని చెయ్యాలి. అధికారులు అందుబాటులో ఉండాలి. కాని పెన్షన్ మాత్రం ఇప్పుడు ఇంటికే రావడంపై లబ్దిదారుల్లో హర్షం వ్యక్తమవుతుంది. చంద్రబాబు నాయుడు సర్కార్ 200 ఉన్న పించన్ ని రెండు వేలు చేసినా సరే ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పెడుతూ ఉండేది అనే ఆరోపణలు అప్పట్లో జనం విన్నారు.

ఇప్పుడు మాత్రం కాస్త కొత్తగా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి తన మార్క్ చూపించారు పెన్షన్ ఇవ్వడం లో. వాలంటీర్ వ్యవస్థను అధికారంలోకి వచ్చిన నెలల కాలంలో ప్రవేశపెట్టిన సిఎం… ఇప్పుడు లబ్దిదారులకు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని ఆదేశించారు. దీనితో టార్గెట్ పెట్టుకుని మరీ లబ్దిదారులకు వాలంటీర్లు ఉదయం నుంచే పెన్షన్ లు ఇవ్వడం గమనార్హం. 90 శాతం మందికి పెన్షన్ లు ఇవ్వడం దాదాపుగా అయిపోయింది.

సాయంత్రం ఆరు గంటలకు 57 లక్షల మందికి పెన్షన్ అందించారు వాలంటీర్లు. దీనితో జగన్ పై పలువురు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. పరిపాలనలో సమూల మార్పులు అంటే పేదవాడి కోసం కొత్తగా ఆలోచించడం అంటున్నారు విమర్శకులు. చాలా మంది వృద్దులు వికలాంగులు వెళ్ళకుండా ఉండిపోతారని, ఆర్ధిక ఇబ్బందులు పడతారని, అలాంటి వారికి ఇంటికే వెళ్లి పెన్షన్ ఇవ్వడం అనేది మంచి విధానం అంటూ పలువురు జగన్ పాలనకు ఫుల్ మార్కులు వేస్తున్నారు. పెన్షన్ దాతా సుఖీభవా అనేస్తున్నారు జగన్ ని.

Read more RELATED
Recommended to you

Exit mobile version