ఆనం రామనారాయణకు సీఎం జగన్ భారీ షాక్.. అసలు విషయం ఇది

-

ఈ రెండు నెలల్లోనే శెభాష్ సీఎం సాబ్.. అని ప్రజలతో అనిపించుకున్నారు జగన్. అయితే… ప్రజల విషయంలోనే కాదు.. వైఎస్సార్సీపీ పార్టీలోనూ… ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా నిక్కచ్చిగా ఉంటాయి. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డ వారికే పదవులను కట్టబెట్టారు జగన్.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఏపీలో అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయింది. కానీ… తక్కువ సమయంలోనే ఎన్నో వినూత్న పథకాలను తీసుకొచ్చి ప్రజలకు దగ్గరయ్యారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లా కాకుండా.. జగన్ ప్రజలకు ఏది అవసరమో… ఏం చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారో… తెలుసుకొని దాని ప్రకారం నడుచుకుంటున్నారు. బహుశా.. పాదయాత్రలో ఆయన ప్రజల సమస్యలను దగ్గర్నుంచి చూశారు కనుక.. వాళ్లకు ఏం ఇస్తే బాగుంటారో అర్థం చేసుకొని ఆ విధంగా ముందుకెళ్తున్నారు.

ఈ రెండు నెలల్లోనే శెభాష్ సీఎం సాబ్.. అని ప్రజలతో అనిపించుకున్నారు జగన్. అయితే… ప్రజల విషయంలోనే కాదు.. వైఎస్సార్సీపీ పార్టీలోనూ… ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా నిక్కచ్చిగా ఉంటాయి. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డ వారికే పదవులను కట్టబెట్టారు జగన్.

చివరకు.. నామినేటెడ్ పదవుల విషయంలోనూ జగన్ ఎక్కడా తొందరపడటం లేదు. ఎవరికి పడితే వాళ్లకు కట్టబెట్టడం లేదు. ఈ విషయం కొందరు నేతలకు బాధిస్తోందట. ఎందుకంటే.. మాకు మంత్రి పదవి వస్తుంది.. అని అనుకున్న కొందరు ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటు రాకపోయేసరికి చిన్నబుచ్చుకున్నారు.

పోనీ… నామినేటెడ్ పదవి ఏదైనా ఇస్తారులే అని అనుకొని సంతృప్తి పడ్డా.. చివరకు అది కూడా దక్కక అసంతృప్తితో కొట్టుమిట్టాడుతున్నారు కొందరు నేతలు. అందులో ఒకరు నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి.

నిజానికి ఆనంకు రాజకీయాలు కొత్తేమీ కాదు. ఆయనకు రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉంది. ఆయన ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులను అనుభవించారు. అందుకే… ఈసారి జగన్ కేబినేట్ లో ఆనంకు చాన్స్ దొరుకుతుందని అంతా భావించారు. కానీ.. ఆనంకు అటు మంత్రి పదవి దక్కలేదు.. ఇటు ఏ నామినేటెడ్ పదవీ దక్కలేదు.

దీంతో ఆనం చిన్నబుచ్చుకున్నారట. నిజానికి ఆనం సోదరులు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు.. తన పార్టీలోకి రావాలంటూ జగన్ ఆహ్వానించారట. జగన్ ఆఫర్ ను తిరస్కరించి మరీ.. వాళ్లు టీడీపీలో చేరారు. అంతే కాడు.. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్టు విని.. జగన్ పై వాళ్లు విమర్శల వర్షం కురిపించారు. ఇవన్నీ జగన్ ను బాధించాయి.

అయినప్పటికీ… వాళ్లు మళ్లీ వైసీపీలో చేరుతామంటే వాళ్లకు జగన్ విలువిచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచారు కూడా. కానీ… నెల్లూరు జిల్లాకు చెందిన ఎందరో నేతలు… పార్టీ కోసం కష్టపడ్డారు. అందుకే.. జగన్ వాళ్లకు పదవులు ఇచ్చారు కానీ.. ఆనం సోదరులకు ఇవ్వలేదు.

సరే.. అవేమీ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ… కనీసం డీసీసీబీ చైర్మన్ పదవిని తన అనుచరుడు ధనుంజయరెడ్డికి ఇవ్వాలంటూ ఆనం కోరినా.. జగన్ పట్టించుకోలేదట. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ విజయకుమార్ రెడ్డికే డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వడానికి మొగ్గు చూపారట. దీంతో ఆనం కొంచెం అసమ్మతితోనే ఉన్నారట. ఎంత అసంతృప్తితో ఉన్నా ఇప్పుడు చేసేదేమీ లేదు కదా. అందుకే.. జగన్ ను ఏం అనలేక.. తనలో తాను కుమిలిపోతున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version