ఆంధ్ర ప్రదేశ్ ను విభజించిన నాడు ఇచ్చిన హామీ లను అమలు చేయాలని పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని వైసీపీ లోక్ సభ , రాజ్య సభ ఎంపీ లకు సీఎం జగన్ సూచించాడు. విభజన హామీ ల పై అవసరం అయితే కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీ లకు సూచించాడు. కాగ పార్లమెంట్ సమావేశాలు సమీపంచడం తో తమ పార్టీ ఎంపీ లతో వైసీపీ అధినేత ముఖ్య మంత్రి జగన్ సమావేశం నిర్వహించాడు.
పార్లమెంటు ఉభయ సభల్లో వైసీపీ ఎంపీలు వ్యవహరిచాల్సిన విధానం, వ్యూహాల పై చర్చించారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొన్న సమస్య లపై పార్లమెంట్ ఉభయ సభ ల్లో చర్చించాలని సీఎం జగన్ అన్నారు. కాగ ఈ నెల 29 నుంచి పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు నిర్వహించనున్నారు. కాగ ఈ సమావేశాల్లో వైసీపీ నుంచి విభజన హామీ లపై చర్చ కు పట్టు పట్టే అవకాశం ఉంది. అలాగే ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా చాలా నష్ట పోయింది. దీని పై కూడా చర్చించే అవకాశం ఉంది.