తెలంగాణలో వరిధ్యానం సమస్యలు ఎక్కువవుతున్నాయి. కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరిధాన్యం కొనుగోలు అంశమే ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారింది. మొన్నటి దాకా బీజేపీ, అధికార టీఆర్ఎస్ ల మధ్య వరి ధాన్యం కొనుగోలు అంశం మంటలు పుట్టించింది. రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా వరి ధాన్యం కొనుగోలు కోసం దీక్షలు చేయబోతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా పోరు బాటకు సిద్దమైంది.
ఇందిరా పార్క్ వేదికగా శని, ఆదివారాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో వరి దీక్ష చేపడుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలపారు. ఈ దీక్షకు రైతులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపు ఇచ్చారు. రైతులకు న్యాయం చేసే దాకా పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతు సమస్యలకు కారణం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలే కారణమని ఆయన విమర్శించారు. ఈ రెండు పార్టీలు రైతులకు ద్రోహం చేస్తున్నాయన్నారు. తెలంగాణలో ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆలస్యం వల్లే వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి.