గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే వారికి సిఎం కేసీఆర్ గుడ్ న్యూస్…!

-

నేడు తెలంగాణా కేబినేట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ప్రకటిస్తారు. నిర్ణిత పంటల సాగు విధానం, గ్రామాల్లోనే పంటల కొనుగోలుపై కాసేపట్లో తెలంగాణ సిఎం కేసిఆర్ సమీక్ష చేస్తారు. యాసంగిలో ఏ పంట వేయాలి, ఏ పంట వేయొద్దు, ఏ పంట వేస్తే లాభం, నష్టం తదితర అంశాల పై సమీక్ష ఉంటుంది. కేంద్రం పెద్ద ఎత్తున మక్కలను దిగుమతి చేసుకుంటున్న నేపధ్యంలో.. రాష్ట్రం లో మక్కల సాగుపై నిర్ణయాన్ని ప్రకటిస్తారు సిఎం కేసీఆర్.

సాయంత్రం 5 గం కు తెలంగాణ కేబినెట్ భేటి ఉంటుంది. ఈనెల 13, 14 న అసెంబ్లి సమావేశాలని నిర్వహించనున్న నేపధ్యంలో ప్రవేశపెట్టనున్న బిల్లులపై చర్ఛించనుంది కేబినెట్. గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో జిహెచ్ఎంసి బిల్లుకు సవరణలు చేస్తారు. ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్నా ఎన్నికల్లో పోటీకి అవకాశం ఉండేలా నిర్ణయం తీసుకుంటారు. 2016 గ్రేటర్ ఎన్నికల రిజర్వేషన్ల అమలు చేస్తారు. గ్రేటర్ ఎన్నికల నిర్వహణ, ఎన్నికల తేదీల నిర్ణయం ఇక ప్రభుత్వానిదే అని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news