చాలా దేశాల్లో కరోనా ఉంది కాని ఫస్ట్ మేము చెప్పాం అంతే: చైనా

-

చైనాలోని వుహాన్ లోని బయో ల్యాబ్ నుండి కరోనా వైరస్ బయటకు వచ్చింది అని ప్రపంచం మొత్తం చైనా టార్గెట్ గా ఆరోపణలు చేస్తుంది. అయితే ఈ తరుణంలో చైనా విదేశాంగ శాఖా ప్రతినిధి హువా చునైంగ్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్య చేసారు. గత సంవత్సరం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఘోరమైన వైరస్ మొదట బయటకు వచ్చిందని దానిని ప్రకటించిన దేశం చైనా అని చెప్పారు ఆమె.

“కరోనావైరస్ ఒక కొత్త రకమైన వైరస్, నివేదికలు వెల్లడిస్తున్న కొద్దీ మరిన్ని వాస్తవాలు వెలువడుతున్నాయి. గత సంవత్సరం చివరలో ప్రపంచంలోని వివిధ ప్రదేశాలలో అంటువ్యాధి సంభవించిందని మనందరికీ తెలుసు. అయితే చైనా మొదటిసారిగా ఈ వ్యాప్తిని నివేదించింది. వ్యాధికారకతను గుర్తించి, జన్యు శ్రేణిని ప్రపంచంతో పంచుకున్నాం అని ఆమె చెప్పారు. కట్టడికి చాలా ఎక్కువ చర్యలు తీసుకున్నాం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news