ప్రధాని మోడీ పై కేసీఆర్ బృందం విరుచుకుపడుతోంది.రాష్ట్ర విభజనకు సంబంధించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలేవీ సమంజసంగా లేవని మండిపడుతోంది. ఈ నేపథ్యంలో మొన్నటి వేళ కేసీఆర్ ప్రెస్మీట్ పెట్టి మరీ! ప్రధానిపై విరుచుకుపడ్డారు.ఇవాళకూడా అదే ఆవేశంలోనో,ఆవేదనలోనో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దలు రాజ్యసభ సమావేశాలను బహిష్కరించారు. ప్రధాని మోడీపై ప్రివిలైజ్ మోషన్ (అకార్డింగ్ టు రూల్ నంబర్ 187 ) మూవ్ చేశారు. దీని ప్రకారం ప్రధాని మోడీపై పార్లమెంట్ ఆఫీసులో నోటీసులు ఇచ్చారు.
ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ను కే కేశవరావు,ఇతర ఎంపీలతో కూడిన బృందం కలిసి తమ గోడు విన్నవించుకు న్నారు.ప్రధాని వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని,తెలంగాణ ఏర్పాటు చేసే వేళ పార్లమెంట్ తలుపులు మూసి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేశారని,విభజన అశాస్త్రీయంగా ఉందని చెప్పడం అన్నది అర్ధరహితం అని కేకే అంటున్నారు.