లాలాజల టెస్ట్‌తో డజన్ల వ్యాధులను గుర్తించవచ్చట..పరిశోధనలో తేలిన షాకింగ్‌ నిజాలు..?

-

చాలా వ్యాధులను గుర్తించడానికి బ్లడ్ టెస్ట్ ప్రధానంగా చేస్తారు..కానీ లాలాజల నమూనా నుంచి డజన్ల కొద్దీ వ్యాధులను గుర్తించవచ్చని తాజా పరిశోధనలో తేలింది.. మధుమేహం నుంచి క్యాన్సర్ వరకు అన్ని వ్యాధులను తెలుసుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు. వ్యాధి గురించి ఇన్వెస్టిగేషన్ కూడా సులువవుతుందట. తక్కువ సమయంలో వ్యాధులను కనుగొనవచ్చు. ఇంకా ఈ పరిశోధనలో ఏం తేలిందంటే..!

మానవ లాలాజలంలో 700 సూక్ష్మజీవులు, యూరిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు ఉన్నాయని పరిశోధకులు నివేదికలో పేర్కొన్నారు. . ఇందులో వ్యాధులను సూచించే అనేక రసాయనాలు ఉంటాయని వీటిని బట్టి వ్యాధులను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.

యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్ దత్తా మేఘ్.. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడం చాలా విషయాలకు సంకేతమని చెబుతున్నారు. లాలాజలంలో ఉండే యూరిక్ యాసిడ్, వ్యాధుల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుందట. యూరిక్ యాసిడ్‌ పెరుగుదల కారణంగా రక్తపోటు పెరుగుతుంది. అంతే కాకుండా గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, క్యాన్సర్, బ్లడ్ షుగర్, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లను కూడా గుర్తించవచ్చు.

2018లో హైపర్‌టెన్షన్ అనే జర్నల్‌లో ప్రచురించిన వ్యాసం ప్రకారం.. పురుషులలో పోలిస్తే యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న మహిళల్లో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం రెండింతలు ఉంటుందని స్పష్టంగా చెప్పారు.

2020లో జర్నల్ ఆఫ్ క్యాన్సర్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచడం వల్ల అనేక రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతోంది.

అసలు ఏంటీ ఈ యూరిక్ యాసిడ్?

ఇది రక్తంలో కనిపించే ఒక రసాయనం. ఇది ప్యూరిన్ ఆహారాల జీర్ణక్రియ ప్రక్రియలో వెలువడుతుంది. బఠానీలు, బచ్చలికూర, పుట్టగొడుగులు, ఎండిన బీన్స్, పంది మాంసం, చికెన్, చేపలు, మటన్, కాలీఫ్లవర్, కిడ్నీ బీన్స్, బీర్‌లలో ఎక్కువగా ప్యూరిన్లు కనిపిస్తాయి.

శరీరంలో ఉత్పత్తి అయ్యే యూరిక్ యాసిడ్ చాలా వరకు రక్తంలో కరిగిపోతుంది. మిగిలినవి మూత్రపిండాల ద్వారా విసర్జించబడతాయి. కానీ శరీరంలో ప్యూరిన్ పరిమాణం ఒక నిర్దిష్ట పరిమాణం కంటే ఎక్కువ అయినప్పుడు..మూత్రపిండాలు వాటిని ఫిల్టర్ చేయలేవు. అప్పుడు శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా సమస్యలు పెరుగుతాయట.

Read more RELATED
Recommended to you

Latest news