ప్ర‌జ‌ల్లో విశ్వాసం కోల్పోయార‌నే ఆందోళ‌న‌లు : డీ కే అరుణ‌

తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌జ‌ల్లో విశ్వాసం కోల్పోతున్నామ‌నే టీఆర్ఎస్ ఆందోళ‌న‌లు చేస్తున్నార‌ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. హుజురాబాద్ లో బీజేపీ గెలిచిన త‌ర్వాత సీఎం కేసీఆర్ మ‌తి పోయింద‌ని అన్నారు. అలాగే రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో సేద తీర‌డానికే వ‌చ్చార‌ని విమ‌ర్శించారు. కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఢిల్లీలో ఉన్నారో లేదో కూడా తెలుసుకోకుండానే మంత్రులు ఢిల్లీ వచ్చారని అన్నారు. వారు ఢిల్లీలో పార్టీ ఆఫీస్ నిర్మాణం పై తిప్ప‌లు ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. సీఎం ఏది చెబితే ఆదే మంత్రులు మాట్లాడుతున్నార‌ని అన్నారు.

అలాగే మంత్రుల‌ను ఏ మొఖం పెట్టుకుని మంత్రులను ఢిల్లీ కి పంపించావ‌ని సీఎం కేసీఆర్ ను ప్ర‌శ్నించారు. అలాగే రాష్ట్రం లో రైతుల‌ను పూట‌కు ఒక మాట చెప్పి రైతుల‌ను ఆగం చేస్తున్నార‌ని ఆగ్ర‌హించారు. ధాన్యం కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్ప‌ష్టం చేశారు. కానీ కేంద్రం పై సీఎం కేసీఆర్ లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నారని విమ‌ర్శించారు. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారనే ప్రచారం జరుగుతుందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామ‌ని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని అమిత్ షా సూచించారని తెలిపారు.