టార్గెట్ ఎర్రబెల్లి: హస్తం కొత్త స్కెచ్? 

-

అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షాలతో రోజురోజుకూ ఇబ్బందులు పెరిగిపోతున్నాయి…ఒక ప్రతిపక్షం ఉంటేనే…చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ టీఆర్ఎస్ మాత్రం రెండు పార్టీలని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాంగ్రెస్, బీజేపీలు దూకుడుగా రాజకీయం చేయడం టీఆర్ఎస్ పార్టీకి కాస్త కష్టంగా మారిందనే చెప్పొచ్చు. ఆ రెండు పార్టీలు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నాయి. అలాగే పార్టీ పరంగానే కాకుండా…బలమైన నేతలని సైతం టార్గెట్ చేసి పనిచేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న బలమైన నేతలకు చెక్ పెడితేనే…టీఆర్ఎస్ కు చెక్ పెట్టగలమని భావిస్తున్నాయి.

అందుకే ఆ దిశగానే కాంగ్రెస్, బీజేపీలు పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నాయి..అయితే టీఆర్ఎస్ పార్టీలో బలంగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ని కాంగ్రెస్ పార్టీ గట్టిగానే టార్గెట్ చేసిందని చెప్పొచ్చు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎర్రబెల్లిని ఈ సారి నిలువరించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఎర్రబెల్లి బలం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టీడీపీలో పనిచేస్తున్నప్పటి నుంచి ఎర్రబెల్లికి జిల్లాలో మంచి ఫాలోయింగ్ ఉంది..వర్ధన్నపేట వరుసగా గెలవడం, మధ్యలో ఒకసారి ఎంపీగా గెలవడం..మళ్ళీ పాలకుర్తి నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎర్రబెల్లి విజయం సాధించారు..టీడీపీ వీక్ గా ఉన్న సమయంలో కూడా ఎర్రబెల్లి గెలిచారంటే…ఆయన బలం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు..ఇక టీడీపీ నుంచి బయటకొచ్చి..టీఆర్ఎస్ లో చేరి..2018లో మరొకసారి పాలకుర్తిలో గెలిచి మంత్రిగా పనిచేస్తున్నారు.

ఇప్పుడు పాలకుర్తిలో ఎర్రబెల్లిని మించిన బలమైన నాయకుడు లేరు. ఇలా బలంగా ఉన్న ఎర్రబెల్లికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ చూస్తుంది..అందుకే ఆయనపై బలమైన ప్రత్యర్ధిని నిలబెట్టాలని చూస్తుంది. వరంగల్ జిల్లాలో బలంగా ఉన్న కొండా ఫ్యామిలీని ఎర్రబెల్లిపై పోటీకి దించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కొండా మురళిని..పాలకుర్తి బరిలో దింపాలని రేవంత్ ప్లాన్ చేశారని తెలిసింది. మరి కొండా బరిలో దిగితే…ఎర్రబెల్లికి కాస్త గట్టి పోటీ వచ్చే ఛాన్స్ ఉంది. చూడాలి ఈ సారి పాలకుర్తిలో ఫైట్ ఎలా ఉంటుందో?

Read more RELATED
Recommended to you

Latest news