మూసీపక్షాళనపై తగ్గేదేలే అంటున్న కాంగ్రెస్.. ఎటూ తేల్చుకోలేని స్థితిలో బీఆర్ఎస్..

-

మూసీ ప్రక్షాళనకు కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. ప్రతి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దీని ప్రస్తావన తీసుకొస్తున్నారు.. ప్రక్షాళన తప్పదంటూనే.. అందుకోసం ఓ కమిటీని సైతం ఏర్పాటు చేస్తున్నారు..దీనిపై నిన్నమొన్నటి వరకు స్పందించిన బీఆర్ఎస్ పార్టీ..ఈ మధ్య సైలెంట్ అయింది.. పోరాటం చేస్తే మైలేజ్ వస్తదా అన్న ఆలోచనలో పడింది.. ఇంతకీ ఆ పార్టీ నేతలు మదిలో ఉన్నదేంటో చూద్దాం..

ప్రతి విషయంలో కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేసే కారు పార్టీ.. మూసీ ప్రక్షాళన విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది.. మూసీ కంపు తీస్తామని సర్కార్ అంటుంటే.. ముంపు బాధితుల పరిస్థితి ఏంటని బిఆర్ఎస్ ప్రశ్నిస్తోంది.. ఆక్రమణల తొలగింపు రాజకీయ దుమారం రేపుతోంది.. దీనిపై బీఆర్ఎస్ గతంలో లాగా దూకుడుగా వ్యవహరించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.. నిన్నమొన్నటి వరకు మూసీ నిర్వాసితులకు ఆ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావులు అండగా నిలిచారు.. తెలంగాణా భవన్ లో సమావేశాలు ఏర్పాటు చేసి మరీ.. అండగా ఉంటామన్నారు.. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలు ఆలోచలో పడ్డారట..

మూసీ ప్రక్షాళనపై పోరాటం కరక్టేనా అన్న డైలమాలో ఆ పార్టీ ఉందనే టాక్ వినిపిస్తోంది.. పోరాటాలు చేస్తే మైలేజ్ వస్తుందా అనే చర్చ పార్టీలో నడుస్తోంది.. మూసీ ప్రక్షాళనలో భాగంగా దాదాపు 16వేల ఆక్రమణలు తొలగిస్తున్నారు.. అందులో మెజార్టీ జనం పేద వర్గాల వారే ఉన్నారు.. వారందరికీ డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని రేవంత్ సర్కార్ చెబుతోంది.. ఈ వ్యవహారమే వారిని డైలమాలో పడేసినట్లు చర్చ నడుస్తోంది..

మూసీ ప్రక్షాళన వల్ల నష్టం కంటే లాభమే ఎక్కువగా ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఉపాధి కల్పించకపోతే అప్పుడు ఆందోళన చేస్తే పార్టీకి మైలేజ్ వస్తుందని.. ఇప్పుడు పోరాటాలు చేస్తే.. ఓ వర్గంలో వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉందనే కామెంట్స్ బీఆర్ ఎస్ నేతల నుంచి వినిపిస్తున్నాయి.. మొత్తంగా మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ ఎటూ తేల్చుకోలేకపోతోందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది..

Read more RELATED
Recommended to you

Latest news