వైసీపీ నేత‌ల‌పై క్రిమిన‌ల్ కేసులు పెట్టాలి – కేశినేని నాని

కృష్ణ జిల్లా కొండ ప‌ల్లి మున్నిప‌ల్ చైర్మెన్ ఎన్నిక సర్వ‌త్ర ఉత్కంఠ నెల‌కొంటుంది. తాజా గా కొండ ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మెన్ ఎన్నిక పై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. కొండ ప‌ల్లి మున్సిపాలిటీ ని వైసీపీ సొంతం చేసుకోవ‌డానికి అడ్డ దారులు తొక్కుతుంద‌ని టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. టీడీనీ కౌన్సిల‌ర్ల ను అనేక ర‌కాలుగా ప్ర‌లోభ లు పెడుతున్నార‌ని కేశినేని నాని అన్నారు.

అలాగే కొండ ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మెన్ ఎన్నిక ను స‌జావు గా సాగేలా చూడాల‌ని పోలీసుల‌ను కేశినేని నాని కోరారు. దీని కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూసామ‌ని అన్నారు. మ‌రొక్క రెండు రోజులు ఓప్పిగ్గా ఎదురు చూద్దామ‌ని అన్నారు. అలాగే టీడీపీ కౌన్సిలర్ల ను ప్ర‌లోభల కు గురి చేస్తున్న వైసీపీ నేత ల పై ఆర్వో క్రిమిన‌ల్ కేసులు పెట్టాల‌ని కేశినేని నాని డిమాండ్ చేశాడు. కాగ ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ ల ఎన్నిక‌ల స‌మ‌యంలో కొండ ప‌ల్లి మున్సిప‌ల్ లో హంగ్ నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఎంపీ కేశినేని నాని ఎక్స్ ఆఫియో ఓటు పై నే ఎవ‌రు గెలుస్తారో తెలుస్తుంది.