బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పై పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. సోషల్ మీడియా పోస్ట్‌లో సిక్కు కమ్యూనిటీకి వ్యతిరేకంగా.. కించపరిచే పదజాలాన్ని ఉపయోగించినందుకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై పోలీసులు మంగళవారం (నవంబర్ 23) ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ (DSGMC) కంగనాపై ఫిర్యాదు చేసిన ఒక రోజు తర్వాత సబర్బన్ ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ముంబైకి చెందిన వ్యాపారి అమర్జీత్ సింగ్ సంధు సోమవారం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉద్దేశ పూర్వకంగా మత విశ్వాసాలను కించపరడం, మతాన్ని అవమానపరచడంతో ఐపీసీ 295ఏ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు.
ఇటీవల కంగనా రనౌత్ రైతు ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమాన్ని ఖలిస్థాని ఉద్యమంగా.. రైతులను ఖలిస్థానీ తీవ్రవాదులంటూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సిక్కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కంగనా రనౌత్ పై కేసులు పెడుతున్నారు.