డిల్లీ నుంచి వాచిపోయేలా కొట్టారు  చంద్రబాబు కి బంపర్ దెబ్బ !!

-

ఢిల్లీలో ఉన్న కేంద్ర పెద్దలు టీడీపీ అధినేత చంద్రబాబు కి రాజకీయంగా వాచిపోయేలా అదిరిపోయే బంపర్ దెబ్బ కొట్టారు. మేటర్ ఏమిటంటే అప్పట్లో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుపతి లో నక్సలైట్ల దాడి జరగడంతో చంద్రబాబుకి ఎన్ఎస్జీ భ‌ద్ర‌త‌ అప్పటి నుండి కొనసాగించడం జరిగింది.

 

ఇటువంటి నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్జీ భ‌ద్ర‌త‌ చంద్రబాబుకి తీసివేయడం జరిగింది. దేశంలోనే బ్లాక్ క్యాట్ భ‌ద్ర‌ల‌ను క‌లిగి ఉన్న అతి త‌క్కువ‌ మంది ప్ర‌ముఖుల్లో చంద్ర‌బాబు నాయుడు ఒక‌రుగా ఉన్నారు. గత పన్నెండు సంవత్సరాలు నుండి ఎన్ఎస్జీ భ‌ద్ర‌త‌ కలిగిన చంద్రబాబుకి 25 మంది అధికారులు భద్రతా వలయంగా ఉంటున్నారు.

 

దేశంలో ఇటువంటి భద్రత కలిగిన రాజకీయ నాయకుల లో ప్రముఖులలో చంద్రబాబు ఒకరు. ఇటువంటి నేపథ్యంలో ఇటీవల కేంద్ర హోంశాఖ ఎన్ఎస్జీ భ‌ద్ర‌త‌ గురించి సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా ప‌లువురు ప్ర‌ముఖుల భ‌ద్ర‌త‌ను త‌గ్గిస్తూ వ‌స్తోంది. ఆ జాబితాలో చంద్ర‌బాబు  కూడా చేరారు. ఆయ‌న‌కు ఎన్ఎస్జీ భ‌ద్ర‌త‌ను ర‌ద్దు చేసింది కేంద్రం. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై చంద్రబాబు ఇప్పటిదాకా ఏం మాట మాట్లాడలేదు. 

Read more RELATED
Recommended to you

Latest news