ఆ కామెంట్లు అచ్చెన్నాయుడితో లోకేష్‌ కు దూరం పెంచాయా?

-

రాజ‌కీయాల‌న్నాక సొంత పార్టీ నేత‌ల నుంచి కూడా దూరం పెరుగ‌డం కామ‌న్‌. అయితే ఈ సారి ఇద్ద‌రు అగ్ర నేత‌ల మ‌ధ్య దూరం పెరిగిన‌ట్టు తెలుస్తోంది. వారెవ‌రో కాదు నారా లోకేష్‌ , అచ్చెన్నాయుడు. కొంత కాలంగా వీరు మాట్లాడుకోవ‌ట్లేద‌ని టీడీపీలో చ‌ర్చ జ‌రుగుతోంది. దీనిపై ఇటు లోకేష్ గానీ అటు అచ్చెన్న గానీ నోరు మెద‌ప‌క‌పోవ‌డ‌మే అనుమానానికి దారి తీస్తోంది.

ఇదుకు కార‌ణం తిరుప‌తి ఎంపీ ఎన్నిక‌ల‌ప్పుడు అచ్చెన్నాయుడు చేసినట్టుగా కొన్ని కామెంట్లు అప్ప‌ట్లో హ‌ల్‌చ‌ల్ చేశాయి. అయితే వీటిపై అచ్చెన్నాయుడు వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. అలాగే చంద్ర‌బాబు నాయుడు గానీ లేదా లోకేశ్ గానీ వివ‌ర‌ణ అడ‌గ‌లేదు.

పోనీ లోకేశ్‌ను పొగిడిన‌ట్టు కూడా ఎక్క‌డా అచ్చెన్న ప్రసంగించనూ లేదు. దీంతో లోకేష్ బాబు అప్పటి నుంచే అచ్చెన్నాయుడుతో మాట‌లు ఆపేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కనీసం క‌లిసి పలకరించడం కూడా ఇద్ద‌రి మ‌ధ్య లేదని స‌మాచారం. అయితే పార్టీ అన్నాక ఇలాంటివి కామన్ అని విజయవాడకు చెందిన ఓ సీనియ‌ర్ మోస్ట్ నేత వివ‌రించారు. అయితే అచ్చెన్నాయుడుకు ఏపీ అధ్య‌క్షుడి బాధ్య‌త‌లు ఇవ్వ‌డం లోకేష్‌కు ఇష్టం లేదంట‌. మ‌రి ముందు ముందు అచ్చెన్నాయుడి ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version